ఐక్యత, అభివృద్ది చూసి ఓర్వడం లేదు: హరీశ్ రావు
విపక్షాలపై మంత్రి హరీశ్ రావు ఫైరయ్యారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఈ రెండు పార్టీలు 70 ఏళ్లు పాలించి రాష్ట్రానికి చేసిందేమీలేదని విమర్శించారు. అలాంటిది తన ఏడేళ్ల పాలనలో సీఎం కేసీఆర్ ఎన్నో అద్భుతాలు చేసి చూపించారని హరీశ్‌రావు తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రానికి వచ్చిన ప్రధాని నరేంద్రమోడీ తెలంగాణ అభివద్ధి కోసం ఒక్క మాటైనా చెప్పారా అని ప్రశ్నించారు.

తెలంగాణలో ఐక్యత, అభివృద్ధిని చూసి ఓర్వలేక మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి వచ్చిన మోదీ, అమిత్‌షాలు పేదల కోసం, అభివృద్ధి కోసం ఒక్కమాట కూడా చెప్పకున్నా, ప్రజలను మాత్రం రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని హరీశ్‌రావు ధ్వజమెత్తారు. ఇదీ మంచి పద్దతి కాదని సూచించారు. జనం అన్నీ గమనించారని పేర్కొన్నారు. రాజకీయ విమర్శాలపై హరీశ్ రావు ఫైరయ్యారు. ఆయా పార్టీల దుమ్ము దులిపాడు. దానికి కౌంటర్ ఇతర పార్టీ నుంచి రావాల్సి ఉంది.












Click it and Unblock the Notifications