మెదక్ జిల్లా శివ్వం పేట తహసీల్దార్ పై డీజిల్ పోసిన రైతులు .. ఓ రైతు మృతితో, ఉద్రిక్తత

మెదక్ జిల్లా శివ్వం పేటలో తహసీల్దార్ పై రైతులు డీజిల్ పోయడం కలకలం రేపింది. నిన్న తాళ్లపల్లి తండా వాసి మాలోతు బాలు అనే రైతు పొలం వద్ద విద్యుత్ షాక్ తగిలి ప్రాణాలు కోల్పోయారు. అయితే సకాలంలో తహసీల్దార్ పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వకపోవడం వల్ల విద్యుత్ షాక్ తో ప్రాణాలు పోగొట్టుకున్న రైతుకు బీమా డబ్బులు రాలేదని ఆరోపిస్తూ రైతులు తాసిల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు.

శివ్వంపేట తహసీల్దార్ భాను ప్రకాష్ మాలోతు బాలుకు సకాలంలో పట్టాదారు పాసు పుస్తకాలను ఇవ్వలేదని, ఆ కారణంగానే అతనికి భీమా అందకుండా పోయిందని ఆరోపిస్తూ మృతదేహంతో తహసీల్దార్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. ఇంతా జరుగుతున్న తహసీల్దార్ పట్టించుకోవడం లేదని ఆందోళన చెందిన రైతులు కొందరు ఆత్మహత్యకు పాల్పడతామంటూ తమ వెంట డీజిల్ బాటిళ్లను తెచ్చుకున్నారు. అప్పటికి భానుప్రకాష్ పట్టించుకోకపోవడంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఒక రైతు శివ్వంపేట మండల తహసిల్దార్ అయిన భాను ప్రకాష్ పై డీజిల్ పోశారు.

Thanda Farmers pour diesel on Shivam Peta tehsildar in Medak district

దీంతో తహసిల్దార్ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమ పైన కూడా డీజిల్ పోసుకున్నారు రైతులు. పోలీసులు ఆగ్రహంతో ఉన్న రైతులను శాంతింప చేసే ప్రయత్నం చేశారు.
రాష్ట్రంలో సంగారెడ్డి జిల్లాలో తహసీల్దార్ విజయ రెడ్డి సజీవ దహన సంఘటన గతంలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత సీఎం కేసీఆర్ తహసిల్దార్ల రక్షణ కోసం చర్యలు చేపడతామని చెప్పినా ఇప్పటికీ అక్కడక్కడ తహసీల్దార్ కార్యాలయాల ముందు రైతులు ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక తాజాగా ఈ ఘటన మరోమారు రెండేళ్ల క్రితం జరిగిన అబ్దుల్లాపూర్ మెట్ విజయ రెడ్డి సజీవదహన సంఘటనను గుర్తుకు తెచ్చింది. దీంతో మెదక్ జిల్లాలో ఈ ఘటనపై అధికారిక వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+