నర్సుల తీరు దారుణం, సిజేరియన్ చేయాలంటే బూతులు, వైద్యులు కూడా, చివరికీ

వైద్యో నారాయణో హరి.. వైద్యులను దేవునితో పోలుస్తారు. అలా కొందరు సేవగా భావిస్తారు. మరికొందరు మాత్రం కమర్షియల్.. వైద్యుల తర్వాత స్థానం కంపౌండర్లు, సిస్టర్లదే. వారు కూడా ఓపికతో రోగులను చూడాలీ. విసుక్కోకూడదు. కానీ కొందరు ప్రవర్తన మారడం లేదు. సోషల్ మీడియా పుణ్యాన ఘటనలు వెలుగులోకి వచ్చినా వారు మారడం లేదు. నల్గొండ జిల్లాలో విషాదకర ఘటన జరిగింది.వైద్యులు/ నర్సుల నిర్లక్ష్యంతో ఓ బాలింత మృత్యువాత పడింది.

ఏందమ్మ ఇదీ..

ఏందమ్మ ఇదీ..

నల్లగొండ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆస్పత్రి నర్సులు చేసిన పనిపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. కట్టంగూరు మండలం చెర్వుఅన్నారం గ్రామానికి చెందిన శిరసు అఖిల తొలి కాన్పు కోసం ఈ నెల 9వ తేదీన నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రిలో చేరింది. పరీక్షలు నిర్వహించిన తర్వాత అడ్మిట్‌ చేసుకున్నారు.అప్పటి నుంచి అక్కడే చికిత్స తీసుకుంటుంది.

ఈ నెల 12వ తేదీన పురిటినొప్పులు వచ్చాయి. అక్కడే ఉన్న అఖిల అత్త పూలమ్మ వెళ్లి విషయాన్ని డ్యూటీలో ఉన్న నర్సులకు తెలియజేసింది. దీంతో నర్సులు నొప్పులు రాగానే కాన్పు చేయాలా? అలా అనుకుంటే ప్రైవేటు ఆస్పత్రులకు తీసుకెళ్లండని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మొబైల్‌లో నిమగ్నం

మొబైల్‌లో నిమగ్నం

నర్సులు, డాక్టర్లు ఫోన్లలో నిమగ్నం అయ్యారు. బాధితురాలిని, ఆమె అత్తను బండబూతులు తిట్టి.. చివరికి బెడ్ వద్దకు వచ్చారు. అత్త పూలమ్మ చూస్తుండగా అఖిలను నర్సులు అదిమిపట్టి, పొట్టపై నెట్టారు. దీంతో కడుపుపై ఒత్తిడి పెరిగి తీవ్రంగా రక్తస్రావం అయ్యింది. మగబిడ్డకు జన్మనిచ్చిన అఖిల ఆ వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్లింది.

అప్పటికీ ఆ నర్సులు పట్టించుకోలేదు. మళ్లీ మొబైల్‌ చూస్తూ టైం పాస్ చేశారు. అఖిల భర్త... ఆమె పరిస్థితిని గమనించి ఆస్పత్రి సూపరింటెండెంట్‌ లావుడి లచ్చునాయక్‌కు ఫోన్‌ చేశాడు. ఆయన స్పందించి డ్యూటీ డాక్టర్‌కు ఫోన్‌ చేశారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

ఐసీయూలో చికిత్స..

ఐసీయూలో చికిత్స..

డ్యూటీ డాక్టర్‌ ఆమెను ఐసీయూలో చేర్చి.. చికిత్సను అందించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ రక్తస్రావం ఆగలేదు. డ్యూటీ డాక్టర్‌ ద్వారా అఖిల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న సూపరింటెండెంట్‌ ఈ నెల 14వ తేదీన కుటుంబ సభ్యులను పిలిపించారు. అఖిల పరిస్థితి విషమంగా ఉందని, గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు.

ఆస్పత్రి నుంచి ఇద్దరు సిబ్బందిని ఇచ్చి అంబులెన్సులో పంపించారు. గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లినా అఖిల పరిస్థితి మెరుగుపడలేదు. పరిస్థితి విషమించడంతో శుక్రవారం చనిపోయింది. కుటుంబసభ్యులు, బంధువులు, గ్రామస్థులు గాంధీ ఆస్పత్రి నుంచి మృతదేహాన్ని తీసుకొని నల్లగొండ ఆస్పత్రి ఎదుట శనివారం ఉంచి ఆందోళనకు దిగారు.

భర్తకు ఉద్యోగం

భర్తకు ఉద్యోగం

ఆస్పత్రి వైద్యులు, నర్సుల తీరుతో అఖిల చనిపోయిందని ఆరోపించారు. ఘటనపై విచారణ చేసి చర్యలు తీసుకుంటానని, అఖిల భర్తకు ఆస్పత్రిలో ఏదో ఒక ఉద్యోగం కల్పించేలా చూస్తానని సూపరింటెండెంట్‌ లావుడి లచ్చునాయక్‌ హామీచ్చారు. దీంతో బాధితులు వెనుదిరిగారు. కానీ బాలింత మాత్రం తిరిగిరానీ లోకాలకు వెళ్లిపోయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+