పింఛన్ల పెంపుపై సీఎం కేసీఆర్ కీలక ప్రకటన

నల్గొండ: సూర్యాపేట జిల్లా కావడమే ఒక చరిత్ర అని, చాలా అభివృద్ధి చెందిందని సీఎం కేసీఆర్ అన్నారు. అందరి కృషితోనే రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని అన్నారు. సూర్యాపేటలో ఇంటిగ్రేటెడ్‌ డిస్ట్రిక్ట్‌ ఆఫీసెస్‌ కాంప్లెక్స్‌(కలెక్టరేట్), ఎస్పీ కార్యాలయం, మెడికల్ కాలేజీలను ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్ మాట్లాడారు.

సూర్యాపేటలో రూ.100 కోట్లతో ప్రభుత్వ కార్యాలయాలను ప్రారంభించుకున్నామని, ఇందులో అధికారుల కృషి ఎంతో ఉందని, అందుకు వారిని అభినందిస్తున్నానని సీఎం చెప్పారు. రాష్ట్రంలో 23వ జిల్లా కలెక్టరేట్‌ను ప్రారంభించుకోవడం చాలా సంతోషకరంగా ఉందన్నారు. తలసరి ఆదాయంలో మనం దేశంలోనే నెంబర్‌ వన్‌గా ఉన్నామని సీఎం తెలిపారు. దేశంలో మరే రాష్ట్రంలో కూడా లేని విధంగా తెలంగాణలో జిల్లాకో మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేసుకుంటున్నామని పేర్కొన్నారు.

CM KCR

సుస్థిరాభివృద్ధి సూచీలో కూడా మనం నెంబర్‌ వన్‌గా ఉన్నామని చెప్పారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రైతుల ఆత్మహత్యలు, ఆకలి చావులు తగ్గిపోయాయని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో పస్తులు ఉండే పరిస్థితి లేదని చెప్పారు. ఒకప్పుడు ఫ్లోరైడ్‌తో విలవిల్లాడిన రాష్ట్రం.. ఇప్పుడు జీరో ఫ్లోరోసిస్‌ స్టేట్‌గా మారిందని.. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం వెల్లడించిందని సీఎం కేసీఆర్ చెప్పారు.

మానవాభివృద్ధి సూచికలో రాష్ట్రం మంచి స్థానంలో ఉండటం గర్వకారణమని కొనియాడారు కేసీఆర్. అలాగే తలసరి ఆదాయం, విద్యుత్ వినియోగంలో అగ్రస్థానంలో ఉన్నామని పేర్కొన్నారు. అలాగే సమాజంలో ఆర్ధిక, సాంఘిక అసమానతలు పోవాలని కేసీఆర్​ సూచించారు. నల్గొండకు కాశేళ్వరం నీళ్లు వస్తున్నాయన్నారు. పంజాబ్ కంటే ఎక్కువగా తెలంగాణలోనే వరి పంట పడుతోందన్నారు.

సూర్యపేటలో కళాభారతి నిర్మాణానికి రూ. 25 కోట్లు, మున్సిపాలిటీకి రూ. 25 కోట్లు, సూర్యపేట అభివృద్ధికి రూ. 50 కోట్లు మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు కేసీఆర్. ఎన్నికల సమయంలో కొందరు కొత్త బిచ్చగాళ్లు వచ్చి ఇష్టం వచ్చినట్లు వాగ్ధానాలు ఇస్తారని వారిని నమ్మవద్దని ప్రతిపక్ష పార్టీలనుద్దేశించి కేసీఆర్ వ్యాఖ్యానించారు. ధరణి రైతులకు, ప్రజలకు ఎంతో ఉపయోపడుతోందన్నారు. దానిపై వస్తున్న విమర్శలు పట్టించుకోవద్దన్నారు.

బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని.. వాటిని పట్టించుకోవద్దని ప్రజలను సీఎం కేసీఆర్ కోరారు. రూ. 4వేల పింఛను కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇవ్వడం లేదని.. కానీ, ఇక్కడ ఇస్తామంటున్నారని మండిపడ్డారు. తాము కూడా వచ్చే రోజుల్లో పింఛను పెంచుతామని కేసీఆర్ చెప్పారు. ప్రతిపక్షాల మోసపూరిత మాటలకు మోసపోవద్దన్నారు.

రైతులకు రైతుబంధు, దళితులకు దళితబంధు, కులవృత్తులవారికి రూ. లక్ష ఆర్థిక సాయం అందిస్తున్నట్లు కేసీఆర్ చెప్పారు. ఈ పథకాలు కొనసాగుతాయన్నారు. ఎవరూ తొందరపడవద్దన్నారు. తెలంగాణలో 24 గంటల విద్యుత్ ఇస్తున్నామన్నారు. కాంగ్రెస్ నేతలు 3 గంటలే విద్యుత్ ఇస్తామంటున్నారని.. వారికి ఓటు వేస్తే అధోగతిపాలవడం ఖాయమని హెచ్చరించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆదరించాలని కేసీఆర్ తెలంగాణ ప్రజలకు పిలుపునచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+