ప్రాణం తీసిన వివాహేతర సంబంధం, స్నేహితుడితో కలిపి హతమార్చి..
వివాహేతర సంబంధం విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దానితో ఆ మహిళ బానే ఉంది. కానీ వారిలో ఒకరు చనిపోయారు. ఈ విషాదకర ఘటన నల్గొండ జిల్లాలో జరిగింది. సైదులు అనే వ్యక్తి మాత్రం హత్యకు గురయ్యాడు. ఈ కేసును ఛాలెంజ్ తీసుకున్న పోలీసులు నాలుగు రోజుల్లో నిందితులను అరెస్ట్ చేశారు.
జాజిరెడ్డి గూడెం మండలం అడివెంలలో బొర్ర శైలేందర్ గ్రామానికి చెందిన ఒక మహిళతో వివాహేతర సంబంధం కొనసాగుతోంది. గత 10 ఏళ్లుగా వివాహేతర సంబంధం కంటిన్యూ అవుతుంది. ఏడాది క్రితం శైలేందర్ వేరే మహిళను పెళ్లి చేసుకున్నాడు. గత 4 నెలలుగా వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళతో మనస్పర్ధలు వచ్చి ఆమెకు దూరంగా ఉంటున్నాడు.

గ్రామానికి చెందిన శతకోటి సైదులుతో ఆ మహిళ వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇది తెలిసిన శైలేంద్ర, సైదులును పలుమార్లు హెచ్చరించాడు. తాను వివాహేతర సంబంధం పెట్టుకున్నమహిళతో.. మళ్లి ఎలా వివాహేతర సంబంధం పెట్టుకుంటావని గొడవపడ్డాడు. సైదులు మహిళతో వివాహేతర సంబంధాన్ని కొనసాగించాడు.
సైదులుపై కక్ష పెంచుకున్నశైలేంద్ర తన స్నేహితుడు సతీష్ తో కలిసి సైదులును హత్యచేయటానికి పధకం వేశాడు. జూన్ 29వ తేదీన ప్లాన్ సక్సెస్ కాలేదు. ఈనెల 2వ తేదీన ప్లాన్ చేశారు. ఆ రోజు రాత్రి సైదులు గ్రామంలోని ఓ బెల్టు దుకాణంలో మద్యం సేవిస్తున్నాడు. మూత్ర విసర్జన కోసం బయటకు వచ్చాడు. ఆ సమయంలో, శైలేంద్ర తన స్నేహితుడు సతీష్‌తో కలిసి సైదులు మెడపై కత్తితో నరికి పరారయ్యాడు. మృతుడి కాల్ డేటా ఆధారంగా నిందితులను గుర్తించారు. నిందితులు శైలేంద్ర, సతీష్‌ను అదుపులోకి తీసుకుని కోర్టులో హజరు పరిచారు.












Click it and Unblock the Notifications