నల్గొండ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దళితబంధు అమలు చేస్తే రాజీనామా చేస్తా.. మళ్లీ కోమటిరెడ్డి కామెంట్స్.. జగదీశ్‌పై నిప్పులు

|
Google Oneindia TeluguNews

కేసీఆర్ సర్కార్‌పై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫైరయ్యారు. మంత్రులకు నియోజకవర్గ అభివృద్ధి పట్టడం లేదని విమర్శించారు. ఇతర పార్టీల వారిని చేర్చుకోవడమే పనిగా ఉందని విమర్శించారు. చండూరులో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. మంత్రి జగదీశ్ రెడ్డి మునుగోడు అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. జగదీష్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో సూర్యాపేటలో గెలిచి చూపించు అంటూ సవాల్ విసిరారు.

 implement dalitha bandhu i will be resign:komatireddy rajagopal

ఇదే చివరి ఎన్నిక అంటూ జగదీశ్ రెడ్డిపై ధ్వజమెత్తారు. మంత్రి, టీఆర్ఎస్ నేతలు ఇప్పటికైనా తమ వైఖరి మార్చుకోవాలని హితవు పలికారు. హుజూరాబాద్ మాదిరిగానే మునుగోడులో కూడా దళిత బందు అమలు చేయాలనీ డిమాండ్ చేశారు. మునుగోడులో దళిత బంధు అమలు చేస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. తన ఛాలెంజ్ స్వీకరించి.. దళిత బంధు అమలు చేయాలనీ కోరారు. దళిత బంధు పథకం రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని ఆయన కోరుతున్న సంగతి తెలిసిందే.

హుజురాబాద్ బై పోల్ నేపథ్యంలోనే దళితబంధు పథకం తెరపైకి వచ్చింది. పథకంపై విపక్షాలు గుర్రు మంటున్నాయి. దళితులు ఇప్పుడే గుర్తుకొచ్చారా అని అడుగుతున్నారు. ఎన్నికలు/ బై పోల్ నేపథ్యంలో వారు గుర్తుకు వస్తారా అని అడుగుతున్నారు. లేదంటే బడుగు బలహీన వర్గాలు గుర్తుకురారా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ చెప్పే అబద్దాలను ప్రజలు వినే స్థితిలో లేరని చెప్పారు. వారు అన్నీ గమనిస్తున్నారని వివరించారు. చేసిన న్యాయ, అన్యాయలను గుర్తుకు ఉంచుకుంటారని తెలిపారు. సమయం చూసి బుద్ది చెబుతారని.. బై పోల్‌లో గుణపాఠం తప్పదని అంటున్నారు. కానీ అధికార పార్టీ మాత్రం సంక్షేమ పథకాలే తమ పాలిట విజయం చేకూరుస్తాయని చెబుతున్నారు.

Recommended Video

ఏపీని డ్రగ్స్ మాఫియాగా మార్చిన సీఎం అంటున్న టీడిపి!!

తాము చేసిన పనులే.. విజయానికి నాంది పలుకుతాయని తెలిపారు. దళిత బంధు ఇతర పథకాలపై ప్రభుత్వం.. ఏమీ చేయడం లేదని ప్రతిపక్షాలు గట్టి నమ్మకంతో ఉన్నాయి. అయితే హుజురాబాద్ ఉప ఎన్నికలో ప్రజలు ఏ వైపు ఉంటారో చూడాలీ మరీ. టీఆర్ఎస్ లేదా.. విపక్షాల వైపు చూస్తారో చూడాలీ మరీ.

English summary
implement dalitha bandhu in my constituency. i will be resigned for mla post komatireddy rajagopal reddy said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X