Video..కూసుకుంట్ల ఇదేంటయ్యా.. కేటీఆర్ ను నందమూ.. అంటావా, వీరభద్రాన్ని సీతారాం అని..
మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నిన్న నామినేషన్ వేసిన సంగతి తెలిసిందే. రోడ్ షోలో మాట్లాడారు. కానీ తడబడుతూ చేసిన ప్రసంగం ట్రోల్ అవుతుంది. ఇదీ అధికార పార్టీకి మైనస్ అవుతుందని కొందరు ఆందోళన కూడా చెందుతున్నారు. ఇంతకీ ఆయన ఏం మాట్లాడారో మీరే వినండి.
కూసుకుంట్ల తడబాటు..
తన నామినేషన్ కార్యక్రమానికి వచ్చిన పెద్దలు అంటూ మొదలెట్టాడు. ఇక అక్కడి నుంచి ఒక్కటే అక్షర దోషాలు.. అవీ చిన్నవి అయితే పర్లేదు.. కానీ భారీగా అనడంతో వైరల్ అవుతుంది. తనకు అవకాశం ఇచ్చిన కేసీఆర్ అనే ఒక పదమే కరెక్ట్ గా అన్నారు. మిగతావి అంతా తడబాటే.. నామినేషన్ వేసేందుకు వచ్చిన పెద్దలు అని.. మంత్రి కేటీఆర్ పేరు తప్పుగా పలికారు. కల్వకుంట్ల తారక రామారావు పేరు కాస్త.. నందమూ.. అనేశారు. అక్కడే ఉన్న కార్యకర్తలు గోల చేయడంతో రామారావు అనేసి.. సర్దుకునే ప్రయత్నం చేశారు.

సాంబశివరావు పేరు ఖూనీ చేసి..
ఇటు తర్వాత మంత్రి జగదీశ్వర్ రెడ్డి పేరు ఒక్కటే చక్కగా పలికారు. తర్వాత సీపీఐ, సీపీఎం పెద్దలు అని మొదలెట్టాడు. కూనంనేని సాంబశివరావు పేరును కూడా సరిగా పలకలేదు. సాంబశివరావును.. సాంబ.. శివ.. రావు అని చిత్రంగా పలికేశాడు. తర్వాత అటు వైపు ఉన్న మరో నేతను చూపించాడు. తమ్మినేని వీరభద్రం పేరే ఛేంజ్ చేశాడు. తమ్మినేని సీతారాం అని పలికాడు. పక్కనే ఉన్న మంత్రి జగదీశ్వర్ రెడ్డి కల్పించారు. ఇంకేముంది.. వీరభద్రం అని అనాలని సూచించారు. ఇంకేముంది.. అలా కవర్ చేసుకున్నారు.
ఇదేంటయ్యా అంటూ..
ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం అంటూ ప్రసంగం చేశారు. కానీ ఆయనను చూస్తే.. తాగేసి నామినేషన్ వేసేందుకు వచ్చారా అనే సందేహాం కలిగింది. ఇదేంటయ్యా అంటూ అంతా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిజమే.. అధికార పార్టీ అభ్యర్థి ఇలా తడబాటు ఏంటీ అని సర్వత్రా చర్చకు దారితీసింది.












Click it and Unblock the Notifications