నల్గొండ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మునుగోడు సిత్రాలు: ఇంటికి కిలో చికెన్.. రాజకీయనాయకుల ప్రేమకు షాక్ అవుతున్న ప్రజలు!!

|
Google Oneindia TeluguNews

మునుగోడు ఉపఎన్నిక రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల ప్రచారంలో దూకుడుగా ముందుకు వెళుతున్నాయి. ఈసారి మునుగోడు ఉపఎన్నిక అన్ని రాజకీయ పార్టీలకు కీలకం కావడంతో ఓటర్ల మనసు గెలుచుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు.+

మునుగోడులో బీజేపీ చెప్పిందే చేసిన మంత్రి మల్లారెడ్డి.. మందుపార్టీ ఫోటోలు వైరల్!!మునుగోడులో బీజేపీ చెప్పిందే చేసిన మంత్రి మల్లారెడ్డి.. మందుపార్టీ ఫోటోలు వైరల్!!

ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్న నేతలు

ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్న నేతలు

టిఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీగా బిఆర్ఎస్ గా మారుతున్న క్రమంలో, ఇంట గెలిచి రచ్చ గెలవాలని, మునుగోడు ఉప ఎన్నికలలో విజయాన్ని హస్తగతం చేసుకోవాలని ప్రయత్నిస్తోంది. టిఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పి, మునుగోడులో కాషాయ జెండా ఎగురవేయాలని బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు వెళుతుంది. ఇక తమ సిట్టింగ్ స్థానాన్ని తిరిగి దక్కించుకోవాలని కాంగ్రెస్ పార్టీ పడరాని పాట్లు పడుతుంది. టిఆర్ఎస్ పార్టీకి మునుగోడు ఉపఎన్నిక కీలకంగా మారడంతో ఇప్పటికే మునుగోడు బాట పట్టారు మంత్రులు, ఎమ్మెల్యేలు. ఓటర్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు టిఆర్ఎస్ పార్టీ నేతలు.

 ఇంటింటికీ చికెన్ పంపిణీ చేసిన గులాబీ పార్టీ నేతలు

ఇంటింటికీ చికెన్ పంపిణీ చేసిన గులాబీ పార్టీ నేతలు


ఉప ఎన్నికల నామినేషన్లు దాఖలు అవుతూ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో మునుగోడులో ఆసక్తికర రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయి. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో నల్గొండ జిల్లా చండూరు మండలం పుల్లెంల గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ నేతలు ఆదివారం 700 ఇళ్లకు చికెన్ పంపిణీ చేశారు. ఉదయం ఎనిమిది గంటలకు టిఆర్ఎస్ కార్యకర్తలు బైక్లపై వెళ్లి చికెన్ పంపిణీ చేసినట్టుగా స్థానికంగా చర్చ జరుగుతుంది. సుమారు 2200 ఓటర్లు ఉన్న పుల్లెంల గ్రామ ఓటర్లను ప్రలోభ పెట్టడానికి ఎన్నికల సమయం దగ్గర పడటంతో చికెన్ పంపిణీ చేసినట్లుగా తెలుస్తుంది.

కులాల వారీగా విందులు, ఇంటింటికీ చికెన్ పంపిణీలు

కులాల వారీగా విందులు, ఇంటింటికీ చికెన్ పంపిణీలు


ఇప్పటికే కులాల వారీగా వనభోజనాలు ఏర్పాటు చేసి, ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న టిఆర్ఎస్ పార్టీ నేతలు, మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో ఓటర్లకు కావలసిన వాటిని పంపిణీ చేయడానికి రంగంలోకి దిగడం, అందులో భాగంగా ఇంటింటికి చికెన్ పంచడం ఆసక్తికరంగా మారింది. మునుగోడులో ప్రలోభాల పర్వం కొనసాగుతుందని బీజేపీ నేతలు పదే పదే టిఆర్ఎస్ పార్టీ ని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. మందు, విందులతో, నగదు పంపిణీతో ఓటర్లను ప్రలోభ పెడుతున్నారని ప్రతిపక్షాలు గులాబీ పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నాయి.

 రాజకీయ నాయకుల ప్రేమకు షాక్ అవుతున్న మునుగోడు నియోజకవర్గ ప్రజలు

రాజకీయ నాయకుల ప్రేమకు షాక్ అవుతున్న మునుగోడు నియోజకవర్గ ప్రజలు


ఇక ఓటర్లు మాత్రం ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల నాయకులు చూపిస్తున్న ప్రేమకు షాక్ అవుతున్నారు. ఎన్నికలు ఎప్పటికీ ఇలాగే ఉంటే బాగుంటుందని చెప్పుకుంటున్నారు. ఎన్నికలు లేకపోతే ప్రజల సమస్యలను పట్టించుకునే వారే ఉండరని, ఎన్నికలు వస్తున్నాయంటే జీహుజూర్ అంటూ ఓటర్ల చుట్టూ తిరుగుతున్నారని చర్చించుకుంటున్నారు. మొత్తానికి మునుగోడులో తాజా రాజకీయాలు రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

English summary
Munugode politics went to it's peak. In Chandur Mandal, people are shocked by the love of politicians who distributed chicken of one kilo per house
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X