నల్గొండ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఒరిజినల్ కాంగ్రెస్ లేదు.. ఉద్యమంలో పనిచేసిన వారికి గుర్తింపు లేదు: రాజగోపాల్ రెడ్డి

|
Google Oneindia TeluguNews

అదే స్వరం.. అదే వైఖరి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వైఖరి మాత్రం మారలేదు. అవును అతను పార్టీ వీడతారనే ప్రచారం నేపథ్యంలో బుజ్జగింపుల పర్వం కొనసాగింది. ఇవాళ ఆయన ఇంటికి భట్టి విక్రమార్క వచ్చారు. ఆ తర్వాత రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కానీ పార్టీలో ఉంటానని మాత్రం చెప్పలేదు. వీడటం ఖాయం అని మాత్రం స్పష్టంచేశారు.

ఎక్కడినుంచో వచ్చినవారికి పదవులు..

ఎక్కడినుంచో వచ్చినవారికి పదవులు..


ఎక్కడినుంచో వచ్చిన వారికి పదవులు అని రాజగోపాల్ రెడ్డి అన్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కామెంట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఒకప్పటి మాదిరిగా లేదన్నారు. ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లేదని చెప్పారు. ఉద్యమంలో పనిచేసిన వారికి గుర్తింపు లేదని వివరించారు. తనకు కూడా ప్రాధాన్యం లేదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ తాను దూరం అవుతానని భట్టి వచ్చారని తెలిపారు. సీఎల్పీ పదవీ అడిగానని చెప్పారు. లేదంటే భట్టికి ఇవ్వాలని తనే చెప్పానని వివరించారు. అంతేకాదు పీసీసీ చీఫ్ మార్పు కూడా అంత త్వరగా చేయలేదని కామెంట్ చేశారు. విధానపర అంశాలు చాలా ఉన్నాయని తెలిపారు.

కన్‌ఫ్యూజ్ కాలే..

కన్‌ఫ్యూజ్ కాలే..


తను ఎప్పుడూ కన్‌ఫ్యూజ్ కాలేదని చెప్పారు. తనకు అన్నీ అంశాలపై స్పష్టత ఉందన్నారు. పనిలో పనిగా మంత్రి జగదీశ్ రెడ్డిపై విమర్శలు చేశారు. మునుగోడుకు తనకు ఒకసారి వచ్చినా ఒక్కటే.. జగదీశ్ వందసార్లు వచ్చినా ఒక్కటేనని చెప్పారు. కల్యాణ లక్ష్మీ చెక్కులు ఇచ్చేందుకు మంత్రి రావడం ఏంటీ అడిగారు. మునుగోడు ప్రజలు తనవెంట ఉన్నారని చెప్పారు.

క్రమశిక్షణ చర్యలు

క్రమశిక్షణ చర్యలు


రాజగోపాల్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అంతలోపే ఆయనను భట్టి కలిశారు. అయినా నో యూజ్.. పార్టీ వీడటం పక్కా అని సంకేతాలను ఇచ్చారు. తర్వాత రాజగోపాల్ రెడ్డికి పార్టీ షోకాజు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. దానికి ఆయన సమాధానం బట్టి చర్యలను తీసుకోనుంది. కానీ రాజగోపాల్ రెడ్డి మాత్రం.. పార్టీలో ఇక ఉండనని చెబుతున్నారు. సోదరుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సర్దిచెప్పాలని వీహెచ్ లాంటి సీనియర్లు సజెస్ట్ చేస్తున్నారు.

English summary
original congress is not there komatireddy rajagopal reddy said. bhatti vikramarka meet rajagopal reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X