21న మునుగోడులో భారీ సభ, అమిత్ షా సమక్షంలో బీజేపీలో రాజగోపాల్ రెడ్డి చేరిక
ఇప్పుడు అంతా మునుగోడు చర్చే.. అవును బై పోల్‌లో విజయం గురించి డిస్కషన్.. మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. ఈ నెల 21వ తేదీన బీజేపీలో చేరనున్నారు. అయితే అక్కడ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. సభకు బీజేపీ అగ్రనేత, హోం మంత్రి అమిత్ షా హాజరవుతారు. ఈ మేరకు బీజేపీ ఇంచార్జీ తరుణ్ చుక్ తెలిపారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం విమర్శలు తరుణ్ చుగ్ విమర్శలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజాస్వామాన్యాన్ని అపహాస్యం చేస్తోందని మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌కు అంబేద్కర్ రాసిన రాజ్యాంగంపై నమ్మకం లేదని విమర్శించారు. ప్రధాని మోడీ తెలంగాణ అభివృద్ధి కోసం నిధులు కేటాయిస్తున్నారని.. కానీ కేంద్రం తెలంగాణకు నిధులు ఇవ్వటంలేదని టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం అబద్ధాలు చెబుతోందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాల్సింది అంతా ఇస్తోందని కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రజలకు అన్యాయం చేస్తోందని విమర్శించారు.

తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తున్నాని మండిపడ్డారు. రాష్ట్రంలో బీజేపీ నేతలపై ప్రభుత్వం దాడులు చేయిస్తోందని, ఇది సరైంది కాదని తరుణ్ చుక్ సూచించారు. బీజేపీ చేస్తోన్న ప్రజా సంగ్రామ యాత్రకు అవరోధాలు కల్పిస్తూ.. బీజేపీ నేతలపై దాడులు చేయిస్తోందని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణ పోలీసులు బీజేపీ నేతల పట్ల సరిగా వ్యవహరించడం లేదని మండిపడ్డారు. మునుగోడులో బీజేపీ నిర్వహించే భారీ బహిరంగ సభకు అమిత్ షా హాజరుకానున్నారు. ఆయన సమక్షంలోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరనున్నారు.












Click it and Unblock the Notifications