అతనో 420, ఇన్నాళ్లూ ఏం చేశారు.. రాజగోపాల్ రెడ్డిపై మంత్రి మల్లారెడ్డి ఫైర్
మునుగోడు బై పోల్ లో గెలిచి తీరతాం అని అధికార టీఆర్ఎస్ పార్టీ అంటోంది. సంక్షేమ పథకాలే తమకు శ్రీరామ రక్ష అని చెబుతోంది. ఆ అంశాలతోనే ప్రచారం చేస్తోంది. అయితే అభ్యర్థి కూసుకుంట్ల తడబాటు.. టికెట్ ఆశించి భంగపడ్డ నేతలతో వ్యతిరేకత ఉంది. అయినప్పటికీ తాము రేసులో ఉన్నామని అధికార పార్టీ ధీమాతో ఉంది. మునుగోడు రూ.18 వేల కోట్లు కేటాయిస్తే పోటీ నుంచి తప్పుకుంటామని మంత్రి జగదీశ్ రెడ్డి కామెంట్ చేసిన తర్వాత.. మంత్రి కేటీఆర్ కూడా రిపీట్ చేశారు. మరో మంత్రి మల్లారెడ్డి అయితే మందు పోస్తూ.. దొరికిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మల్లారెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు.

అతనో 420
బై పోల్ లో తమ విజయం తథ్యం అని అంటున్నారు. ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీని గెలిపించి.. సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచాలని కోరారు. చౌటుప్పల్ మండలంలో ఆయన ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై విమర్శలు చేశారు. మునుగోడు ప్రజలను మోసం చేసిన కోమటిరెడ్డి ఒక 420 అని విరుచుకుపడ్డారు.

డెవలప్ కావాలంటే..
టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి ఓటు వేయాలని మంత్రి మల్లారెడ్డి కోరారు. ఇటు మంత్రి సబితా ఇంద్రారెడ్డి నాంపల్లి మండలంలో ప్రచారం చేస్తున్నారు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రజల కోసం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే టీఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

13 ఏళ్ల నుంచి దూరం..
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో బై పోల్ వచ్చింది. ఆయన బీజేపీలో చేరి.. ఆ పార్టీ తరఫున బరిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో స్వేచ్చ లేదని కామెంట్ చేశారు. అయితే ఆయన రూ.18 వేల కోట్ల కాంట్రాక్ట్ తీసుకొని మరీ పార్టీ మారారని కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. తన కంపెనీ వ్యవహారాలు తెలియవని.. గత 13 ఏళ్లుగా ఆఫీసుకు వెళ్లలేదని చెప్పారు.












Click it and Unblock the Notifications