రాజగోపాల్ రెడ్డికి నిరసన సెగ.. హామీల సంగతిని ప్రస్తావించిన స్థానికులు
ప్రచారంతో మునుగోడు హీటెక్కింది. ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నంలో నేతలు బిజీగా ఉన్నారు. అయితే నేతలకు అప్పుడప్పుడు పరాభావం ఎదురవుతాయి. బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడడికి నిరసన సెగ తగిలింది. కోతులాపురంలో బీజేపీ నేత రాజగోపాల్‌రెడ్డికి నిరసన సెగ తగిలింది. కోతులాపురంలో ఎన్నికల ప్రచారంలో రాజగోపాల్‌రెడ్డి పాల్గొన్నారు. తమ గ్రామానికి ఇచ్చిన హామీలు అమలు చేయలేదని రాజగోపాల్‌రెడ్డిని టీఆర్ఎస్, కాంగ్రెస్, సీపీఐ శ్రేణులు అడ్డుకున్నాయి. దీంతో ఎన్నికల ప్రచారం చేయకుండానే రాజగోపాల్‌రెడ్డి వెనుదిరిగి పోయారు.
ఇటీవల మరో ఊరిలో కూడా రాజగోపాల్ రెడ్డికి చుక్కెదురు అయ్యింది. ప్రచారం చేస్తుండగా కొందరు అడ్డుకున్నారు. ఏం చేశారని అడిగారు. మరొక సారి కూడా అలాంటి పరాభావం ఎదురయ్యింది. దీంతో అక్కడి నుంచి ఆయన వెళ్లిపోయారు. ఆ వీడియో తెగ ట్రోల్ అయ్యింది. ఆ తర్వాత మిగతా చోట్ల రాజగోపాల్ రెడ్డి క్యాంపెయిన్ చేశారు.

మునుగోడు ఉప ఎన్నికలో గెలిచి తీరాలని బీజేపీ, టీఆర్ఎస్ అనుకుంటోంది. అందుకోసం ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. కానీ కొందరు ఓటర్లు మాత్రం తమకు ఏం చేశారని అడుగుతున్నారు.
మునుగోడు బై పోల్ లో ప్రధాన పార్టీలు ప్రచారాన్ని మరింత స్పీడప్ చేసింది. టీఆర్ఎస్ జోరుగా క్యాంపెయిన్ చేస్తోంది. బీజేపీ కూడా అదేస్థాయిలో ముందుకు వెళుతుంది. అయితే బరిలో కూడా చాలా మంది అభ్యర్థులు ఉన్నారు. ఇప్పటికే వందకు పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. మరీ వారిలో ఎంతమంది విత్ డ్రా చేసుకుంటారో చూడాలీ.