ఇంటికి కిలో బంగారం ఇచ్చిన నో యూజ్.. దేశం చూపు మునుగోడు వైపు: రాజగోపాల్ రెడ్డి
ఇప్పుడు అంతా మునుగోడు బై పోల్ మీద డిస్కషన్.. అవును ఎక్కడ నలుగురు చూసినా అదే సిచుయేషన్. ఉప ఎన్నిక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి జీవన్మరణ సమస్య.. విజయం సాధిస్తానని ఆయన ధీమాతో ఉన్నారు. ఎన్నికను టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ కూడా ప్రతిష్టాత్మకంగానే తీసుకున్నాయి. బై పోల్ సందర్భంగా నియోజకవర్గంలో నగదు పంపిణీ, మద్యం ప్రవాహంలా పారనుంది.

కిలో బంగారం ఇచ్చినా..
తెలంగాణ ఆత్మగౌరవం కోసం.. కల్వకుంట్ల కుటుంబం కబంద హస్తాల నుంచి రాష్ట్రాన్ని కాపాడేందుకు తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశానని రాజగోపాల్ రెడ్డి చాలా సందర్భాల్లో చెప్పారు. కాంగ్రెస్ వీడి.. బీజేపీలో చేరారు. మునుగోడులో తన విజయంపై ధీమాతో ఉన్నారు. గులాబీ పార్టీ ఇంటికి కిలో బంగారం ఇచ్చిన ఓటేయని పరిస్థితి ఉందన్నారు. ప్రజల్లో మార్పు కనిపిస్తోందని తెలిపారు. దేశం చూపు మునుగోడు వైపు ఉందని రాజగోపాల్ రెడ్డి అన్నారు.

మునుగోడు వైపు చూపు
దేశం మొత్తం మునుగోడు వైపు చూస్తోందని తెలిపారు. మునుగోడులో బీజేపీ గెలిస్తే, నెల రోజుల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రాణం ఉన్నంతవరకు మునుగోడును వదిలిపెట్టనని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. టీఆర్ఎస్ పార్టీలో చేరితేనే ఎమ్మెల్యేలకు కేసీఆర్ అపాయింట్ మెంట్ ఇస్తారని ఆరోపించారు. నియోజకవర్గ సమస్యలపై కేసీఆర్‌తో మాట్లాడే దమ్ము టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు లేదని విమర్శించారు.

మార్పు తథ్యం
రాష్ట్రంలో మార్పు తథ్యం అని రాజగోపాల్ రెడ్డి చెప్పారు. బై పోల్ రిజల్ట్‌తో రాష్ట్రంలో ప్రకంపనలు ఖాయం అని వివరించారు. వచ్చే ఎన్నికల్లో ఇదీ కచ్చితంగా కనిపిస్తోందని తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ బలం పుంజుకోనుందని వివరించారు. కేసీఆర్ గడీకి గండికొట్టడం ఖాయం అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆ స్థాయి లేదని చెప్పారు.












Click it and Unblock the Notifications