నల్గొండ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టోల్ గేట్ వద్ద రద్దీ: తిరిగి సిటీకి రావడంతో బారులు తీరిన వాహనాలు

|
Google Oneindia TeluguNews

దసరా హాలీడేస్ ముగిశాయి. రేపటి నుంచి (సోమవారం) స్కూళ్లు ప్రారంభం కానున్నాయి. దీంతో పండగకు వెళ్లిన చాలా మంది హైదరాబాద్ మహానగరానికి వచ్చేస్తున్నారు. అయితే టోల్ గేట్ల వద్ద ట్రాఫిక్ భారీగా జామ్ అవుతుంది. ఎప్పుడూ ఇలాంటి పరిస్థితే.. అయితే ఫ్టాస్టాగ్ ఉన్న తొందరగా ప్రాసెస్ కావడం లేదు.

పండుగ సెలవులు ముగిసినందున స్కూళ్లు తిరిగి ప్రారంభం కానున్నాయి. పండక్కి ఊరెళ్లిన పట్టణవాసులు సొంతూళ్ల నుంచి హైదరాబాద్ నగరానికి తిరుగు ప్రయాణం అయ్యారు. అందరూ ఒక్కసారిగా రావడంతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ నెలకొంది. టోల్ గేట్ల దగ్గర వాహనాలు బారులు తీరాయి.

 vehicles are jam in Panthangi toll gate

యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్ గేట్ దగ్గర వాహనాల రద్దీ కొనసాగుతోంది. దసరా సెలవులు ముగియడంతో గ్రామాల నుంచి నగర బాట పట్టారు. హైదరాబాద్-విజయవాడ 65వ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగిపోయింది. పంతంగి, నల్గొండ జిల్లా కొర్లపహాడ్ టోల్ ప్లాజాల దగ్గర వాహనాలు బారులుతీరాయి. ఫాస్టాగ్ స్కాన్‌కు కూడా సమయం పడుతుండటంతో ట్రాఫిక్ నెమ్మదిగా సాగుతోంది.

సంక్రాంతి సమయంలో కూడా ఇలానే ఉంటుంది. ఇక్కడ భారీగా వాహనాలు నిలిచిపోతుంటాయి. ఆ సమయంలో డ్యూటీ వేసే సిబ్బందికి చుక్కలే. దసరా సమయానికి కూడా అంతే కానీ, ఆ స్థాయిలో ర్యాష్ ఉండటం లేదు.

English summary
vehicles are jam in Panthangi toll gate due to came to the andhra pradesh people.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X