నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆనందయ్య నాటుమందు: 15 నిమిషాల్లో లేచిన విద్యార్థి, ఆశ్చర్యపోయిన సోమిరెడ్డి

|
Google Oneindia TeluguNews

ఆనందయ్య నాటు మందు కరోనాకు సంజీవనిలా పనిచేస్తోంది. ఈ విషయాన్ని ఆయుష్ కూడా అంగీకరించిన సంగతి తెలిసిందే. దీంతో నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు జనం తండోపతండాలుగా వస్తున్నారు. అయితే ఆనందయ్య మందు ఫలితం చూసినవారు చెబుతున్నారు. తక్కువ అయినవారు కూడా డిస్కష్ చేస్తున్నారు. ఇవాళ ప్రత్యక్షంగా చూసే అవకాశం ఉంది. టీడీపీ ప్రతినిధుల బృందం.. ఓ వ్యక్తికి ఆనందయ్య మందు ఇవ్వగా.. ఆయన వెంటనే కోలుకుని కనిపించాడు. దీంతో వారు ఆశ్చర్యపోయారు.

ఆశ్చర్యపోయిన సోమిరెడ్డి..

ఆశ్చర్యపోయిన సోమిరెడ్డి..

ఆనందయ్య మందు తయారు చేసే ప్రాంతాన్ని టీడీపీ ప్రతినిధి బృందం మంగళవారం సదర్శించింది. సోమిరెడ్డి, బిదా రవిచంద్ర, పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి ఆధ్వర్యంలో నేతలు స్థానికంగా జరుగుతున్న ఔషధ పంపిణీని పరిశీలించారు. అక్కడ జరిగిన ఘటన టీడీపీ నేతలను ఆశ్చర్యానికి గురిచేసింది. తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా పెద్దపల్లికి చెందిన విద్యార్థి విషమ పరిస్థితుల్లో అక్కడికి వచ్చాడు.

15 నిమిషాల్లో లేచిన విద్యార్థి

15 నిమిషాల్లో లేచిన విద్యార్థి

సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అండ్ కో అక్కడ ఉండగానే అతడి కంటిలో ఆనందయ్య కుటుంబ సభ్యులు చుక్కలు వేశారు. అంతే 15 నిమిషాల్లో ఆ విద్యార్థి లేచి కూర్చోవడంతో అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. తమలాంటి పేదలకు ఆనందయ్య ముందు పంపిణీ జరిగేలా చూడాలని అభ్యర్థించారు. ఆనందయ్య మందును అన్నీ వర్గాలకు ఉచితంగానే అందజేస్తున్న సంగతి తెలిసిందే.

 రాజకీయాలు వద్దు..

రాజకీయాలు వద్దు..

నెల్లూరు జిల్లా నాయకులు, అధికారులు రాజకీయాలు పక్కన పెట్టి ఆనందయ్య మందు పంపిణీ జరిగేలా చూడాలని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోరారు. నివేదికలను సాకుగా చూపి కాలయాపన చేయకుండా ఆనందయ్య ముందు పంపిణీ జరిగేలా సీఎం జగన్మోహన్ రెడ్డి చొరవ తీసుకోవాలన్నారు. గతంలో కృష్ణపట్నం పోర్టు వల్ల దేశం మొత్తం కృష్ణపట్నం వైపు చూసిందని టీడీపీ జాతీయ కార్యదర్శి బీద రవిచంద్ర అన్నారు. ఆనందయ్యతో మళ్లీ నేడు దేశమంతా కృష్ణపట్నం వైపు దృష్టిసారించిందని తెలిపారు.

Recommended Video

Yellow Fungus Cases Reported In UP | Oneindia Telugu

English summary
anandaiah nattuvaidyam: 15 minutes after student standing at krishnapatnam. tdp leader somireddy chandra mohan reddy Surprised.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X