నెల్లూరులో తీరం దాటనున్న తుఫాన్: ఏపీలోనూ భారీ వర్షాలు; ఆ జిల్లాల్లో కంట్రోల్ రూమ్ ల ఏర్పాటు
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో తమిళనాడు రాష్ట్రంలోనే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక ఇదే విషయాన్ని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి దక్షిణ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతుంది. గంటకు 27 కిలోమీటర్ల వేగంతో వాయువ్య పశ్చిమ దిశగా కదులుతున్న వాయుగుండం కరైకల్- శ్రీహరికోట మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీంతో నెల్లూరు జిల్లాలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వాయుగుండం ప్రభావంతో నెల్లూరు, ప్రకాశం, కడప, చిత్తూరు జిల్లాలపై భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.

నెల్లూరులో దంచికొడుతున్న వర్షాలు
ఇప్పటికే నెల్లూరు, చిత్తూరు జిల్లాలతో పాటు మరికొన్ని ప్రాంతాలలో భారీ వర్షం కురుస్తోంది. తుఫాను ప్రభావంతో నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గంలో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తున్న పరిస్థితి ఉంది. స్వర్ణముఖి బ్యారేజీ కి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. రెండు గేట్లను ఎత్తి 600 క్యూసెక్కుల నీటిని అధికారులు ఇప్పటికే విడుదల చేస్తున్నారు. మరోవైపు పంబలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. నెల్లూరు జిల్లాలో వరదల కారణంగా నెల్లూరు తీరంలో సముద్రం ముందుకు వస్తోంది. సముద్రం అల్లకల్లోలంగా ఉన్న నేపథ్యంలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

నెల్లూరు, చిత్తూరులలో కంట్రోల్ రూమ్ ల ఏర్పాటు
బుధవారం నాడు నాయుడుపేటలో అత్యధికంగా 40 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కాగా అత్యల్పంగా కూరలో 12.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన నెల్లూరు, చిత్తూరు జిల్లాల అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. కంట్రోల్ రూములను ఏర్పాటు చేసి సహాయక చర్యలు చేపట్టారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా అధికారులు చర్యలు చేపట్టారు. ఇదిలా ఉంటే ఇప్పటికే చిత్తూరు జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. జిల్లా వ్యాప్తంగా కూడా పరిస్థితి ఇదే విధంగా ఉంది. చిత్తూరు జిల్లాలో కురుస్తున్న విపరీతమైన వర్షాలతో భీమా, స్వర్ణముఖి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి.

పలు గ్రామాలకు రాకపోకలు బంద్ .. ఏపీలో తుఫాన్ ఎఫెక్ట్ ఉన్న జిల్లాలు ఇవే
భారీ వర్షాల కారణంగా రోడ్లు కొట్టుకుపోతున్నాయి. పలు గ్రామాలకు ఇప్పటికే రాకపోకలు నిలిచిపోయాయి. అధికార యంత్రాంగం వరద సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతాలకు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో అతి భారీ వర్షాలు, కడప, గుంటూరు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
Recommended Video

సముద్ర తీరాల వద్ద అలెర్ట్ .. మత్సకారులకు హెచ్చరిక
తుఫాను ప్రభావంతో తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కర్నూలు జిల్లాలలో కూడా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇక ఇప్పటికే విశాఖ, గంగవరం ,కాకినాడ, మచిలీపట్నం ,కృష్ణ పట్నం, నిజాంపట్నం పోర్టులకు ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. కళింగపట్నం, వాడరేవు, భీమునిపట్నంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. మత్స్యకారులు ఎవరూ ఈ రెండు రోజులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని సూచించారు.
-
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications