నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అంబరంపై తిరుగులేని ఆధిపత్యం: పీఎస్ఎల్ఎల్వీ 50వ ప్రయోగం: దూసుకెళ్లిన రిశాట్

|
Google Oneindia TeluguNews

నెల్లూరు: వరుస ప్రయోగాలతో అంతరిక్షంపై తిరుగులేని ఆధిపత్యాన్ని సాగిస్తోన్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో మైలురాయిని అందుకుంది. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన రిశాట్ 2బీఆర్1 ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించింది. బుధవారం సరిగ్గా 3:25 నిమిషాలకు రిశాట్ అంతరిక్షంలోకి దూసుకెళ్లబోతోంది. నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలో గల సతీష్ ధవన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం ఒకటో నంబర్ లాంచ్ ప్యాడ్ నుంచి దీన్ని నింగిలోకి పంపించింది.

50వ ప్రయోగం..

50వ ప్రయోగం..

ఇస్రో తురుపుముక్క పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (పీఎస్ఎల్వీ) ప్రయోగాల్లో ఇది 50ది. రిశాట్-2బీఆర్1 ఉపగ్రహంతో పాటు వివిధ దేశాలకు చెందిన తొమ్మిది వాణిజ్యపరమైన ఉపగ్రహాలను మోసుకెళ్లింది పీఎస్ఎల్ఎల్వీ. నిర్దేశిత కక్ష్యలోకి చేరిన తరువాత అందులోని ఉపగ్రహాలు పీఎస్ఎల్వీ నుంచి విడివడ్డాయని ఇస్రో శాస్త్రవేత్తలు వెల్లడించారు. దీనితో ఈ ప్రయోగం విజయవంతమైనట్లు ప్రకటించారు.

628 కేజీల బరువైన ఉపగ్రహాలు..

628 కేజీల బరువైన ఉపగ్రహాలు..

మొత్తం 628 కేజీల బరువు ఉన్న వివిధ పేలోడ్లను పీఎస్ఎల్వీ అంతరిక్షంలోకి మెసుకెళ్లబోతోంది. తొమ్మిది విదేశీ పేలోడ్స్ ఉన్నాయి.మల్టీ మిషన్ లెమూర్ ఉపగ్రహాలు-4, టెక్నాలజీ డెమోన్ స్ట్రేషన్ శాటిలైట్-1, ఎర్త్ ఇమేజింగ్ శాటిలైట్-1, రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ డచిఫ్యాట్-3, సెర్చ్ అండ్ రెస్క్యూ శాటిలైట్, రాడార్ ఇమేజింగ్ శాటిలైట్ క్యూపీఎస్-3 చొప్పున పీఎస్ఎల్వీ ద్వారా అంతరిక్షంలోనికి పంపించనున్నారు. అమెరికా, ఇజ్రాయెల్, ఇటలీ, జపాన్ లకు చెందిన శాటిలైట్లు అవి. వాటన్నింటితో పాటు మనదేశానికి చెందిన రిశాట్ ను పంపించారు.

రెండువారల్లో రెండోసారి..

రెండువారల్లో రెండోసారి..

కొద్దిరోజుల వ్యవధిలోనే ఇస్రో వివిధ దేశాలకు చెందిన కమర్షియల్ శాటిలైట్లను నింగిలోనికి పంపించడం ఇది రెండోసారి. ఇదివరకు అమెరికాకు చెందిన తొమ్మిది కమర్షియల్ శాటిలైట్లను ఇస్రో అంతరిక్షంలోకి పంపించింది. కిందటి నెల 27వ తేదీన ఇస్రో శాస్త్రవేత్తలు కార్టోశాట్-3ని నింగిలోకి పంపించిన విషయం తెలిసిందే. కార్టోశాట్-3 శాటిలైట్ తో పాటు అమెరికాకు చెందిన తొమ్మిది ఉపగ్రహాలను ఈ సందర్భంగా విజయవంతంగా ప్రయోగించారు.

English summary
SRO's PSLV-C48 carrying earth observation satellite RISAT-2BR1 and nine foreign satellites was launched from Sriharikota on Wednesday, 11 December. The workhorse Polar Satellite Launch Vehicle, on its 50th mission, PSLV-C48, blasted off from the first launch pad of the Satish Dhawan Space Centre at Sriharikota, the Indian Space Research Organisation said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X