నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కళ్లెదుటే భార్య ఉరేసుకుని ప్రాణాలు వదిలింది: వీడియో తీస్తూ భర్త పైశాచికానందం

|
Google Oneindia TeluguNews

నెల్లూరు: జిల్లాలోని ఆత్మకూరులో విషాద ఘటన చోటు చేసుకుంది. భర్త కళ్లెదుటే భార్య ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే, ఆమెను అడ్డుకోకుండా ఉరివేసుకో అంటూ ప్రోత్సహించడం గమనార్హం. కళ్లముందే భార్య ప్రాణాలు తీసుకుంటుంటే.. తాపీగా సెల్‌ఫోన్లో వీడియో తీస్తూ పైశాచికానందం పొందాడు ఈ దుర్మార్గుడు.

అంతేగాక, భార్య ఆత్మహత్య చేసుకుంటున్న దృశ్యాలను వీడియో తీసి ఆమె బంధువులకు పంపించాడు. కాగా, మృతురాలు ఆత్మకూరు మెప్మాలో రిసోర్స్ పర్సన్‌గా పనిచేస్తున్న కొండమ్మగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పైశాచికానందం పొందిన భర్త పెంచలయ్యను అరెస్ట్ చేశారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. కాగా, నిందితుడ్ని కఠినంగా శిక్షించాలంటూ మెప్మా సిబ్బంది ఆందోళన చేపట్టారు.

Nellore: a married woman committed suicide in front of her husband.

భర్త కళ్లెదుటే ఉరివేసుకున్న కొండమ్మ.. విలవిల్లాడుతూ ప్రాణాలు కోల్పోయింది. ఫ్యాన్‌కి చీరకట్టి మెడకు వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. చివరకు గిలగిలా కొట్టుకుంటూ చనిపోయింది. కాగా, పెంచలయ్య ప్రవేటు సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు. తల్లి మృతి చెందడం, తండ్రి జైలుపాలుకావడంతో ఆ పిల్లలు అనాథలుగా మారారు. కాగా, పెంచలయ్య అనుమానంతో నిత్యం భార్య కొండమ్మను వేధిస్తున్న నేపథ్యంలోనే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.

పని ఒత్తిడితో యువకుడు ఆత్మహత్య

పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో విషాదం చోటు చేసుకుంది. బీటెక్ విద్యార్థి విశ్వేశ్వరరావు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వర్క్‌ ఫ్రంహోంలో సకాలంలో పని పూర్తి కాకపోవడంతో తీవ్ర ఒత్తిడికి గురైన విశ్వేశ్వరరావు ఇంట్లో ఫ్యాన్‌కి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా, అతడు పనిచేస్తున్న విలియం టెక్ కంపెనీ.. వర్క్ ఫ్రం హోంలో సకాలంలో పని పూర్తి చేయకపోవడంతో.. బాధితుడి నుంచి నష్ట పరిహారం కోరింది. డబ్బు చెల్లించాలని తీవ్ర ఒత్తిడి చేసింది.

ఈ క్రమంలో ఆందోళనకు గురైన విశ్వేశ్వరరావు.. సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు.
కాగా, వర్క్ ఫ్రం హోం రోజుల్లో యువకులతో ఫేక్ కంపెనీలు చెలగాటం ఆడుతున్నాయి. విశ్వేశ్వరరావు ఆత్మహత్య కేసులో గుజరాత్‌కు చెందిన నకిలీ కంపెనీ వ్యవహారం బట్టబయలు అయ్యింది. గుజరాత్‌కు చెందిన విలియం టెక్ కంపేనీ.. ఆన్‌లైన్ వర్క్ ద్వారా లక్షలు సంపాదించమంటూ ప్రకటన విడుదల చేసింది. అది నమ్మిన పెనుగొండకు చెందిన బీటెక్ విద్యార్థి విశ్వేశ్వరరావు(21).. 14 వేల జీతంలో ఆన్‌లైన్‌లో వర్క్ చేశాడు.

అయితే, నెల రోజుల తరువాత శాలరీ అడగటంతో అసలు విషయం బయటపెట్టుకుంది కంపెనీ. చేసిన వర్క్‌లో తప్పులున్నాయని నష్ట పరిహారం కోరింది సంస్థ. దీంతో విశ్వేశ్వరరావు రూ. 5 వేలు చెల్లించాడు. అయినప్పటికీ ఇంకా డబ్బు డిమాండ్ చేయటంతో.. తీవ్ర ఓత్తిడికి గురయ్యాడు విశ్వేశ్వరరావు. ఈ క్రమంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే, విశ్వేశ్వరరావు పని చేసిన విలియం టెక్ కంపెనీ నకిలీదిగా పోలీసులు గుర్తించారు. సదరు కంపెనీ నిర్వాహకులను గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు. కంపెనీ నిర్వాహకుల ఒత్తిడి వల్లే విశ్వేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నట్లుగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

English summary
Nellore: a married woman committed suicide in front of her husband.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X