శ్రీశైలం వెళ్లొస్తూ మృత్యు ఒడిలోకి -నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం -8మంది తమిళనాడు వాసులు మృతి
ఆథ్యాత్మిక పర్యటన ముగించుకుని వెళుతోన్న భక్త బృందం అనూహ్య రీతిలో అనంతలోకాలకు ఎగిశారు. శ్రీశైలంలోని మల్లన్న ఆలయాన్ని దర్శించుకుని చెన్నైకి తిరుగుపయనమైన వారు మార్గం మధ్యలోనే మృతృవాత పడ్డారు. నెల్లూరు జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మొత్తం ఎనిమిది మంది చనిపోగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, స్థానికులు చెప్పిన వివరాలివి..
నెల్లూరు జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుచ్చిరెడ్డిపాలెం మండలం దామరమడుగు వద్ద జాతీయ రహదారిపై ఆగిఉన్న లారీని వేగంగా దూసుకొచ్చిన టెంపో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టెంపోలో ప్రయాణిస్తున్న ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. మృతులు తమిళనాడు వాసులుగా గుర్తించారు.

చెన్నై నుంచి వచ్చిన వీరంతా శ్రీశైలం మల్లన్న ఆలయంతోపాటు ఏపీలోని తదితర ప్రాంతాల్లో ఆధ్యాత్మికయాత్ర ముగించుకుని ఆదివారం రాత్రి నెల్లూరుకు పయనమయ్యారు. తెల్లవారుజామున 2.15 గంటల సమయంలో దామరమడుగు శివారులోకి రాగానే పెట్రోల్ బంక్ వద్ద ఆగిఉన్న లారీని టెంపో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో
ఎంపీ అరవింద్‌పై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు -భైంసా అల్లర్లు -ప్రొఫెసర్ కోదండరాం ప్రస్తావన

టెంపో ముందు భాగం నుజ్జునుజ్జవడంతో డ్రైవర్ గుర్నాథంతో పాటు, వాహనంలో ముందుకూర్చున్న మరో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. నెల్లూరు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందారు. 8మంది గాయాలతో బయటపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో టెంపోలో 15 మంది ఉన్నారు. సమాచారమందుకున్న సీఐ సురేశ్‌బాబు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గురైన వాహనాన్ని పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు. డ్రైవర్ నిద్రమత్తు, పొగ మంచు కారణంగానే ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు.