నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బ్యాంక్ మేనేజర్ వికృతచేష్టలు: క్యాబిన్లోకి ఒంటరిగా మహిళలు రాగానే..

|
Google Oneindia TeluguNews

నెల్లూరు: అవసరాన్ని ఆసరాగా చేసుకుని తన వద్దకు వచ్చే మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఓ బ్యాంక్ మేనేజర్ వికృత చేష్టలు వెలుగులోకి వచ్చాయి.
నెల్లూరు జిల్లాలోని పొదలకూరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)మేనేజర్ నగేష్ కామ కలాపాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు కావడంతో బట్టబయలయ్యాయి. ఈ మేనేజర్ కామ వాంఛకు ఎందరో మహిళలు చెప్పుకోలేని వేదనకు గురయ్యారు.

రుణాల కోసం వచ్చే మహిళలను ఒంటరిగా తన క్యాబిన్‌కు పిలిపించుకుని లైంగిక వేధింపులకు పాల్పడేవాడు. లోన్ గురించి వచ్చే మహిళల అవసరాన్ని ఆసరాగా చేసుకుని వారి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించేవాడు. మహిళల ప్రైవేట్ భాగాలను తాకుతూ వికృతానందాన్ని పొందేవాడు మేనేజర్ నగేష్. బాధిత మహిళలు రుణాలు రాకుండా అడ్డుకుంటాడేమోనని భయంతో మిన్నకుండిపోయేవారు.

nellore: podalakur sbi manager allegedly molesting women account holders.

మరికొంతమంది తమ పరువు పోతుందని భావించి బయటకు చెప్పుకోలేకపోయారు.
అయితే, సీసీటీవీలో రికార్డైన ఫుటేజీ వైరల్ కావడంతో నగేష్ వికృతచేష్టలు వెలుగుచూశాయి. దీంతో మీడియా ఛానళ్లలో నగేష్ వికృత చేష్టల వీడియోలు ప్రసారం కావడంతో మేనేజర్ నగేష్ బ్యాంక్ నుంచి పరారయ్యారు.

సీసీటీవీ కెమెరా ఫుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో ఉన్న నిందితుడు నగేష్ కోసం గాలింపు చేపట్టారు. ఇలాంటి కామంధులను కఠినంగా శిక్షించి, మహిళలను కాపాడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

పాము కాటేయడంతో వ్యక్తి మృతి

పాములు పట్టుకోవడంలో నైపుణ్యంగలవాడిగా పేరు తెచ్చుకున్న ఓ వ్యక్తి.. పాము కాటుకు బలయ్యాడు. ఈ విషాద ఘటన కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మాలపల్లిలో జరిగింది. పాఠశాల వద్ద పాము కనిపించడంతో స్థానికులు రంగస్వామి అనే వ్యక్తిని పిలిచారు. అతను అక్కడికి చేరుకుని కర్రతో పామును కొట్టాడు. అది చనిపోయిందనుకుని చేతితో పట్టుకుని చూస్తుండగానే.. పైకి లేచిన పాము అతడ్ని కాటేసింది. వెంటనే స్థానికులు ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.

English summary
nellore: podalakur sbi manager allegedly molesting women account holders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X