• search
  • Live TV
నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎస్పీ సార్.. ఏం స్టోరీ చెప్పారు.. కోర్టు చోరీ ఇన్సిపై బుద్దా వెంకన్న.. మరీ పేపర్లు..?

|
Google Oneindia TeluguNews

నెల్లూరు కోర్టులో చోరీకి సంబంధించి ఎస్పీ విజయరావు మీడియాకు ఇన్పో ఇచ్చారు. అయితే దీనిపై టీడీపీపై రియాక్షన్స్ వస్తున్నాయి. తొలుత టీడీపీ నేత బుద్దా వెంకన్న స్పందించారు. ఏమీ స్టోరీ చెప్పారు సార్ అంటూ ట్వీట్ చేశారు. నెల్లూరులో గల కోర్టు ఆవరణలో 4వ అదనపు కోర్టులో గురువారం చోరీ జరిగింది. పలు కేసులకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లు చోరీకి గురయ్యాయి. మంత్రి కాకాని గోవర్దన్ రెడ్డిపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వేసిన కేసుకు సంబంధించిన ఆధారాలు చోరీకి గురయ్యాయని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో చోరీ జరగడం.. ఎస్పీ ప్రెస్ మీట్ చెప్పడంపై బుద్దా వెంకన్న స్పందించారు.

స్టోరీ సూపర్.. సార్..

స్టోరీ సూపర్.. సార్..


ఏమీ స్టోరీ చెప్పారు సార్ అని బుద్దా వెంకన్న సెటైర్ వేశారు. ఐరన్ దొంగతనానికి వెళ్లిన వారికి ఆధారాలు ఏం అవసరం అని అడిగారు. కుక్కలు మొరగడంతో భయపడి కోర్టు రూమ్ పగులగొట్టారా అని నిలదీశారు. మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆధారాలు మాత్రమే పట్టుకుని వచ్చేశారని.. ఆ దొంగలకు వాటితో పనేంటని అడిగారు. ఐరన్ దొంగలు, కుక్కలు, బ్యాగు... కథ బలే ఉంది కదా అంటూ బుద్ధా ఎద్దేవా చేశారు. ఆ దొంగలు ఎవరో కానీ.. వారిని మాత్రం ఇనుము దొంగతనం చేసేవారని సర్టిఫై చేశారని పేర్కొన్నారు.

పేపర్లు పడేశారా..?


నెల్లూరు కోర్టు చోరీ కేసులో పోలీసులు ఇద్దరు పాత నేరస్తులను అరెస్టు చేశారు. చోరీకి గురైన వస్తువులను రికవరి చేశామని నెల్లూరు ఎస్పీ విజయరావు వెల్లడించారు. నిందితులు సయ్యద్‌ హయత్‌, ఖాజా రసూల్‌ను అరెస్టు చేశామని తెలిపారు. కోర్టు ప్రాంగణంలో ఇనుము చోరీకి వెళ్లిన ఇద్దరిని కుక్కలు వెంబడించడంతో కోర్టులోకి వెళ్లారని వివరించారు. అనంతరం కోర్టు తాళాన్ని పగలగొట్టి లోపలికి చొరబడి బీరువాలోని బ్యాగ్‌ లో ఉన్న సెల్‌ఫోన్లు, ల్యాప్‌ట్యాప్‌ తీసుకుని మిగతా పేపర్లను పడేశారని పేర్కొన్నారు.

అన్నీ రికవరీ.. కానీ

అన్నీ రికవరీ.. కానీ

బెంచ్‌ క్లర్క్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ చేపట్టారని తెలిపారు. ఆత్మకూరు బస్టాండ్‌ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు పాత నేరస్తులను అదుపులోకి తీసుకున్నారు. సీసీ కెమెరా ఫుటేజీ సహా పూర్తి ఆధారాలతో కేసును ఛేదించామని వివరించారు. నిందితులు ఇద్దరిని అరెస్టు చేసి వీరి వద్ద నుంచి ట్యాబ్‌, ల్యాప్‌ట్యాప్‌, 4 సెల్‌ఫోన్లు, 7 సిమ్‌ కార్డులు స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ తెలిపారు. కోర్టులో చోరీకి గురైన అన్నింటినీ రికవరీ చేశామన్నారు. నిందితులపై 14 పాత కేసులు ఉన్నాయని ఆయన వెల్లడించారు.

విదేశాల్లో ఆస్తులా..?

విదేశాల్లో ఆస్తులా..?


మలేషియా, సింగపూర్, హాంగ్ కాంగ్‌లో సోమిరెడ్డికి ఆస్తులు ఉన్నాయని, పెద్దమొత్తంలో లావాదేవీలు జరిపారని గతంలో కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపణలు చేశారు. ఇందుకు సంబంధించిన కొన్ని పత్రాలను ఇటీవల విడుదల చేశారు. ఆ పత్రాలను మీడియా ముందు కూడా ఉంచారు. ఆ పత్రాలన్నీ నకిలీవని, తనపై లేనిపోని అభాండాలు వేస్తున్నారని, నకిలీ పత్రాలు సృష్టించిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు సోమిరెడ్డి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కాకాని గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదు చేశారు.

ఫోర్జరీవి అని తేలడంతో

ఫోర్జరీవి అని తేలడంతో

సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై కాకాని గోవర్ధన్ రెడ్డి విడుదల చేసిన పత్రాలు ఫోర్జరీవి అని పోలీసులు గుర్తించారు. కాకాని గోవర్ధన్ రెడ్డి తెచ్చిన డాక్యుమెంట్లు ఫోర్జరీవి అని తేలిందని ఫోరెన్సిక్ లేబోరేటరీ తేల్చింది. అసలు సోమిరెడ్డి మలేషియాకు వెళ్లలేదని ఇమ్మిగ్రేషన్ అధికారులు ధృవీకరించారు. ఫోర్జరీ డాక్యుమెంట్ల కేసులో కొందరిని అరెస్టు కూడా చేశారు. పలువురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో పోలీసులు చార్జీషీట్ దాఖలు చేశారు. ఆధారాలను కోర్టులో భద్రపర్చారు. కోర్టులో భద్రపర్చిన ఆధారాలు చోరీకి గురి కావడం ప్రస్తుతం కలకలం రేపుతుంది. కాకానిపై ఉన్న కేసుకు సంబంధించిన ఆధారాలతో పాటు ఇతర కేసులకు సంబంధించిన ఆధారాలు కూడా చోరీకి గురికావడం చర్చకు దారి తీసింది. కోర్టు సిబ్బంది చిన్నబజార్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

English summary
tdp leader buddha venkanna reacts on court theft incident. nellore sp tells super story he tweeted.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X