ఆనందయ్య నాటు వైద్యం: రెండురోజుల్లో ఆయుష్ కమిషనర్ నివేదిక, జనం రద్దీ కంటిన్యూ..
కరోనా మహమ్మారీకి సరైన మందు ఏదీ లేదు. ఇప్పటివరకు కూడా రాలేదు. ఇమ్యూనిటీ పెంచుకోవాలని.. ఆవిరి పట్టాలని, విటమన్ డీ 3 అంటూ వైద్యులు చెబుతున్నారు. తొలుత ప్లాస్మా తర్వాత రెమిడెసివర్ కూడా వాడారు.. వాడుతున్నారు. అయితే బొనిగి ఆనందయ్య నాటు వైద్యం ఒక్కసారిగా సంచలనం రేపింది. కరోనాను తగ్గిస్తున్నారని.. గంటల్లో ఆక్సిజన్ లెవల్స్ పెంచడంతో వైద్యులే ఆశ్చర్యపోయారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయుష్ కమిషనర్, ఐసీఎంఆర్‌ను పంపించింది. పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని కోరంది.
Recommended Video

రెండురోజుల్లో నివేదిక..
బొనిగి ఆనందయ్య మందుని శాస్త్రీయంగా అన్ని విధాలుగా పరిశీలిస్తామని ఆయుష్ కమీషనర్ తెలిపారు. మందుకి చట్టబద్ధత కల్పిసే ఎక్కువ మందికి కల్పించే అవకాశం ఉందన్నారు. దీనికి సంబంధించి నివేదికని త్వరితగతిన పంపిస్తామని వివరించారు. రెండు రోజుల్లో ఫలితాలు వస్తాయని ఆయుష్ కమిషనర్ తెలిపారు. ఆనందయ్య కరోనా ఆయుర్వేద మందును పరిశీలించేందుకు ఆయుష్, ఐసీఎంఆర్ బృందాలు కృష్ణపట్నం వచ్చిన సంగతి తెలిసిందే. కరోనాకు విరుగుడుగా ప్రచారం జరుగుతున్న ఆనందయ్య మందుపై అధ్యయనానికి ఈ రెండు బృందం వచ్చాయి.

35 వేల మంది జనం..?
కృష్ణపట్నం వద్ద జనం తాకిడి ఎక్కువగా ఉంది. 5 వేల మందికి మాత్రమే నాటు వైద్యం అందుబాటులో ఉంది. కానీ 35 వేల మంది ఉన్నారు. 2 వేల అంబులెన్సులు ఇక్కడ ఉన్నాయి. దీంతో జనం ఎంతలా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. వీరిని నిలువరించడం పోలీసులకు కష్టంగా మారింది. మరోవైపు ఆనందయ్యకు మెడికల్ మాఫియా, కార్పొరేట్ శక్తుల నుంచి ప్రమాదం ఉంది. దీంతో ఆయనకు పోలీసులు భద్రత కల్పిస్తున్నారు.

సోషల్ మీడియాలో చర్చ..
రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఆస్పత్రుల్లో చికిత్స కూడా కష్టతరంగా మారింది. ఆక్సిజన్ అందక చాలామంది ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. నెల్లూరు జిల్లాలో ఇస్తున్న 'కృష్ణపట్నం ఆయుర్వేద మందు' కరోనాకు బాగా పనిచేస్తోందనే ప్రచారం జరిగింది. దీంతో వేల సంఖ్యలో జనం ఇక్కడకు తరలివస్తున్నారు. శాస్త్రీయంగా రుజువు కాలేదని రాష్ట్ర ప్రభుత్వం పంపిణీని నిలుపుదల చేసింది. పరీక్షల నిమిత్తం ఆయుష్ ల్యాబ్‌కు పంపింది. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.












Click it and Unblock the Notifications