పురుగులు పట్టిన చికెన్.. దర్జాగా అమ్ముతూ.. అధికారులకు అడ్డంగా చిక్కి..!
నెల్లూరు : పనికిరాని, పాడేయాల్సిన చికెన్‌ను దర్జాగా అమ్ముతున్నారు. ఫ్రిజ్‌లలో నిల్వ ఉంచుతూ జనాలకు కట్టబెడుతున్నారు. కుళ్లిన మాంసం అంటగడుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. అధికారుల దాడులతో వెలుగుచూసిన ఈ వ్యాపారం విస్మయం కలిగిస్తోంది. ఒకే ఒక్క చికెన్ సెంటర్‌లో దాదాపు 200 కిలోల మేర నిల్వ ఉంచిన కోడి మాంసం పట్టుబడటం చర్చానీయాంశమైంది. నెల్లూరు జిల్లాలో జరిగిన ఘటన రాష్ట్రమంతటా చర్చానీయాంశంగా మారింది. పలుచోట్ల దాడులు నిర్వహించిన అధికారులు సదరు వ్యాపారులకు జరిమానాలు విధించారు.

కుళ్లిన మాంసం అమ్ముతూ..!
నెల్లూరులో కుళ్లిన మాంసం అమ్ముతున్న ఘటనలు వరుసగా వెలుగుచూస్తున్నాయి. ఇటీవల వారం పదిరోజుల కిందట మటన్ మార్కెట్ ఏరియాలో అధికారులు దాడిచేయడంతో కళ్లు బైర్లు కమ్మే నిజాలు బయటపడ్డాయి. రోజులకొద్దీ నిల్వ ఉంచిన మేక మాంసం అమ్ముతూ వ్యాపారులు అడ్డంగా బుక్కయ్యారు. అదే క్రమంలో శనివారం (17.08.2019) నాడు చికెన్ సెంటర్లపై అధికారులు దాడి చేయడంతో భయంకరమైన విషయాలు వెలుగుచూశాయి.
హరనాథపురంలోని ఓ చికెన్ సెంటర్‌లో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆ క్రమంలో దాదాపు 200 కేజీల మేర నిల్వ ఉంచిన కోడి మాంసం పట్టుబడింది. అమ్మకానికి రెడీ అన్నట్లుగా ఫ్రిజ్‌లలో పెట్టి ఉంచాడు సదరు దుకాణం యజమాని. అయితే అధికారులు సునిశితంగా పరిశీలించడంతో మాంసం కుళ్లిపోయి కనిపించింది. అంతేకాదు పురుగులు పారుతున్నట్లుగా నిర్దారించారు.

వామ్మో ఆ చికెన్ అమ్మి ఉంటే..!
కుళ్లిన మాంసం చూసి అధికారులు నివ్వెరపోయారు. ఇలాంటి మాంసం అమ్ముతుండటంపై దుకాణం యజమానిపై సీరియస్ అయ్యారు. ఒకవేళ శనివారం నాడు గనక అధికారులు దాడి చేసి ఉండకపోతే ఆ 200 కిలోల మాంసం అమ్మేసేవారు. అలా కేజీ చొప్పున రెండు వందల కుటుంబాలు తీసుకెళితే.. ఇంటికి ఐదుగురు చొప్పున ఆ చికెన్ తిని ఉంటే దాదాపు వెయ్యి మంది అస్వస్థతకు గురయ్యేవారనే ఆరోపణలు వినిపించాయి.

పలు రెస్టారెంట్లపై కూడా దాడి.. వేల రూపాయల్లో జరిమానా..!
చెడిపోయిన మాంసం నిల్వ ఉంచిన చికెన్ సెంటర్‌తో పాటు పలు రెస్టారెంట్లపై దాడులు చేశారు అధికారులు. సదరు చికెన్ సెంటర్‌లో 200 కిలోల కుళ్లిన మాంసం లభ్యం కావడంతో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పీవీవీఎస్ మూర్తి 50 వేల రూపాయల జరిమానా విధించారు. అంతేకాదు నిల్వ ఉంచిన రెండు ఫ్రీజర్లను కూడా స్వాధీనపరుచుకున్నారు. జీఎన్‌టీ రోడ్డు సమీపంలోని ఓ రెస్టారెంట్‌లో వండిన మాంసం నిల్వ ఉంచినట్లు గుర్తించారు. ఆ మేరకు సదరు రెస్టారెంట్ యజమానికి 20వేల రూపాయల జరిమానా విధించారు.
అలాగే నిప్పో సెంటర్‌లోని మరో రెస్టారెంట్‌కు 20 వేల ఫైన్ వేశారు. ఇక అయ్యప్ప టెంపుల్ సమీపంలో కూడా ఓ బార్ అండ్ రెస్టారెంట్‌పై దాడి చేశారు. ఫ్రిజ్‌లో బూజు పట్టిన మాంసాన్ని గుర్తించి 50 వేల రూపాయల జరిమానా విధించారు.

2 కోట్లతో భవనం నిరూపయోగం..!
మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న వధశాలలో మేకలు, పొటేళ్లు కోయాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు కమిషనర్. ఇకపై నిరంతర దాడులు కొనసాగిస్తామని తెలిపారు. రూల్స్ బ్రేక్ చేసే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాస్తవానికి మాంసం విక్రయాలపై సవాలక్ష ఆంక్షలున్నా.. వ్యాపారులు ఎవరూ కూడా వాటిని పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. ప్రజారోగ్యశాఖ అధికారి, పశు వైద్యాధికారి జంతువులను పరీక్షించి ఆరోగ్యంగా ఉన్నట్లు ధ్రువీకరిస్తూ ముద్ర వేయాల్సి ఉంటుంది. కానీ, ఈ నిబంధన అమలు కావడం లేదనే టాక్ వినిపిస్తోంది. అదలావుంటే మాంస విక్రయాల కోసం నగరంలో దాదాపు 2 కోట్ల రూపాయలతో నిర్మించిన భవనం నిరుపయోగంగా మారడం గమనార్హం.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications