నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అక్కా నీవే దిక్కు.. మానవత్వం చాటుకొన్న మాజీ ఎంపీ కవిత.. ట్విట్ వైరల్‌

|
Google Oneindia TeluguNews

ఏదైనా విపత్కర పరిస్థితుల్లో రాజకీయ నేతలను కలుసుకోవడం కష్టంగా మారిన సందర్భాలు చాలా ఎక్కువగానే కనిపిస్తుంటాయి. సోషల్ మీడియా వచ్చిన తర్వాత నేతలను చేరుకోవడం.. వారు స్పందించడం చాలా వేగంగా జరిగిపోతున్నాయి. కొన్నిసార్లు రాజకీయాలను పక్కన పెట్టి నేతలు మానవత్వాన్ని చాటుకోవడం వార్తల్లో ప్రధానంగా నిలుస్తుంటాయి. .తాజాగా అలాంటి కోవలోనే నిజామాబాద్ మాజీ ఎంపీ కవిత కల్వకుంట్ల స్పందించిన తీరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మాజీ ఎంపి స్పందించిన తీరుపై హర్షం వ్యక్తమవుతున్నది. వివరాల్లోకి వెళితే..

రోడ్డు ప్రమాదంలో గాయపడి..

రోడ్డు ప్రమాదంలో గాయపడి..

ఇటీవల నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఖరీదైన వైద్య చికిత్సను భరించే స్థితి లేకపోవడంతో పలువురు సహాయాన్ని ఆర్థించారు. కానీ వారికి కావాల్సినంత ఆర్థిక సహాయం అందకపోవడం, అలాగే బాధితుడి ఆరోగ్యం విషయంగా మారడంతో సోషల్ మీడియాను ఆశ్రయించారు.

అక్కా సహాయం అందించండి

మాజీ ఎంపీ కవితను సహాయం ఆర్థిస్తూ అక్క మమ్మల్ని ఆదుకోమంటూ ట్విట్టర్‌లో ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో.. మంత్రి కేటీఆర్‌, కవితను సహయమందించాలని కోరారు. ‘కవిత అక్క.. మేము నిజామాబాద్ జిల్లాకు చెందిన వాళ్లం. నిజామాబాద్‌లో జరిగిన ఓ ప్రమాదంలో చెన్నోజి రాము తీవ్రంగా గాయపడ్డారు. వాళ్లు ప్రస్తుతం హాస్పిటల్ ఖర్చులు భరించే స్థితిలో లేరు అని ట్విట్టర్‌లో పోస్టు పెట్టారు.

గత్యంతరం లేని పరిస్థితిలో

రాము పరిస్థితి విషమంగా ఉండటంతో నిజామాబాద్ హస్పిటల్ బాధితుడిని చేర్చుకోలేదు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌ వెళ్లమని సూచించారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో బర్కత్‌పురలోని ఆస్పత్రిలో చేర్పించారు. వైద్య చికిత్స కావాల్సిన మొత్తాన్ని భరించ స్థితిలో లేరు. దయచేసి వారికి ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలి అని ట్విట్టర్‌ ద్వారా వేడుకొన్నారు.

వేగంగా స్పందించిన కవిత

వేగంగా స్పందించిన కవిత

ట్విట్టర్‌లో పోస్టు చూసిన వెంటనే మాజీ ఎంపీ కవిత వేగంగా స్పందించారు. వెంటనే ఆమె నా కార్యాలయ సిబ్బందిని కలువండి. 040-23599999 ఫోన్ నెంబర్‌కు కాల్ చేసి పరిస్థితిని వివరించండి. మేము తగిన సహాయం.. మెరుగైన వైద్య సేవలు అందిస్తాం. మీకు అంతా మేలు జరుగుతుంది అనే భరోసాను ఎంపీ కవిత అందించారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తున్నది.

English summary
Former MP Kavitha Kalvakuntla responded to road accident victim request. That tweet now goes viral Social media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X