గెలుపోటములు సహజం:ఓడినా నిజామాబాద్‌ను వీడనన్న మాజీ ఎంపీ కవిత
Recommended Video
నిజామాబాద్ లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవిత ఓటమి పాలయ్యారు. ఊహించని ఈ పరిణామం టీఆర్ఎస్ శ్రేణుల్లో నిరుత్సాహం కలిగించింది. ఇక తాను నిజామాబాద్ లోక్ సభ ఎన్నికల్లో ఓటమి పాలవ్వడంపై టీఆర్ఎస్ నేత, కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత స్పందించారు. ఎన్నికల్లో ఓడినా, గెలిచినా తన జీవితం ప్రజలకే అంకితమన్నారు. తన కోసం పని చేసిన కార్యకర్తలకు ధన్యవాదాలు అని పేర్కొన్నారు . ఇక తాజాగా నిజామాబాద్ జిల్లాలో కవిత ఓటమితో కృంగిపోయి అన్నపానీయాలు, నిద్రాహారాలు మానేసిగుండెపోటుకు గురై మృతి చెందిన కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించారు కవిత .

కవిత ఓటమితో మనస్తాపంతో మృతి చెందిన కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన కవిత
నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం మంచిప్ప గ్రామానికి చెందిన టిఆర్ఎస్ కార్యకర్త కిషోర్ కుమార్ శుక్రవారం గుండె పోటుతో మృతి చెందడం పట్ల కల్వకుంట్ల కవిత చలించిపోయారు. సోమవారం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, బిగాల గణేశ్ గుప్తా, షకీల్ ఆమిర్, కె. విద్యాసాగర్ రావు, డాక్టర్ సంజయ్ కుమార్, ఎమ్మెల్సీలు వి.జి గౌడ్, ఆకుల లలిత, మేయర్ ఆకుల సుజాత తో పాటు ఈగ గంగారెడ్డి, సిహెచ్ ప్రభాకర్ రెడ్డి, పలువురు టిఆర్ఎస్ నేతలతో కలిసి కిషోర్ కుటుంబ సభ్యులను కవిత పరామర్శించారు. తన ఓటమిని తట్టుకోలేక మనస్తాపంతో కార్యకర్త కిషోర్ గుండె పోటు కు గురయిన విషయం తెలిసి కల్వకుంట్ల కవిత భావోద్వేగానికి గురయ్యారు. కన్నీటి పర్యంతం అయ్యారు. కిషోర్ మృతి తనను తీవ్రంగా కలచి వేసిందన్నారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటన్నారు. కిషోర్ కుటుంబానికి అండగా ఉంటామన్నారు. పార్టీ కార్యకర్తలు, తన అభిమానులు ధైర్యం కోల్పోవద్దు అని కోరారు. తనది నిజామాబాద్ అని, తాను నిజామాబాద్ ను వదిలిపోనన్నారు. నిజామాబాద్ జిల్లా , రాష్ట్ర అభివృద్ధికి తన కృషి కొనసాగుతుందన్నారు.

రాజకీయాల్లో గెలుపోటములు సహజం .. పదవుల్లో లేకున్నా ప్రజల్లో ఉంటాం అన్న కవిత
రాజకీయాల్లో, ప్రజాస్వామ్యంలో గెలుపోటములు ఉంటాయన్నారు కవిత . ఒడిదుడుకులు సహజం అని కవిత అన్నారు.టిఆర్ఎస్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసే పార్టీ అన్నారు.
పదవుల్లో ఉన్నా లేక పోయినా ప్రజల్లోనే ఉంటామని స్పష్టం చేశారు. మొన్న జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ ను కాదని దేశంలో అధికారంలోకి వస్తుందేమో అన్న ఆశతోనే ప్రజలు బిజెపి వైపు మొగ్గు చూపినట్లు కనిపిస్తోందని కవిత చెప్పారు. మొన్నటి ఎన్నికల్లో బిజెపి పై అనేక ఆశలు ప్రజలు పెట్టుకున్నారు . అందుకే బీజేపీని ఆడరిమ్చారన్నారు. నిజామాబాద్ కు సంబంధించిన ప్రత్యేక ఆకాంక్షలను కొత్తగా ఎన్నికైన అభ్యర్థి, వారి పార్టీ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తుందని ఆశిస్తున్నట్లు కవిత చెప్పారు.

ఓడినా నిజామాబాద్ ను వీడి పోయేది లేదన్న కవిత
ఓటమిలోనూ హుందాగా ఉండటం తెలంగాణ ఉద్యమం నేర్పించింది అన్నారు. ఓటమిలోనూ హుందాగా ఉందాం.. బంగారు తెలంగాణ నిర్మాణం లో కలిసి పనిచేద్దాం అని కవిత కార్యకర్తలను కోరారు. ఎవరూ అధైర్య పడవద్దని తెలిపారు. ఓడినా నిజామాబాద్ ని వీడిపోయేది లేదని ఆమె స్పష్టం చేశారు .
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications