బంపర్ మెజార్టీతో ఎమ్మెల్సీగా కవిత విజయం .. కాంగ్రెస్, బీజేపీల డిపాజిట్లు గల్లంతు
నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గా సీఎం కెసిఆర్ కుమార్తె, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఘన విజయం సాధించారు. అనుకున్నట్లుగానే భారీ మెజార్టీతో మ్యాజిక్ ఫిగర్ ను దాటి కవిత తన విజయాన్ని నమోదు చేశారు. కవిత విజయంతో టీఆర్ఎస్ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు కనిపిస్తున్నాయి. భారీగా సంబరాలు జరుపుకుంటున్నారు .

823 ఓట్లకు గాను 728 ఓట్లు కవిత ఖాతాలో
నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కౌంటింగ్ లో భాగంగా నగరంలోని పాలిటెక్నిక్ కళాశాలలో ఓట్ల లెక్కింపు చేపట్టారు . 6 టేబుల్స్ పై రెండు రౌండ్ ల కౌంటింగ్ నిర్వహించారు.
మొత్తం 823 ఓట్లకు గాను 728 ఓట్లు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కవిత తన ఖాతాలో వేసుకున్నారు. బిజెపి 56 ఓట్లు, కాంగ్రెస్ 29 ఓట్లను నమోదు చేశాయి. ఇక 10 ఓట్లు చెల్లకుండా పోయాయి. కవిత విజయం సాధించడంతో టిఆర్ఎస్ పార్టీ శ్రేణుల సంబరాలు చేసుకుంటున్నాయి.
డిపాజిట్లు కోల్పోయిన బీజేపీ , కాంగ్రెస్
మొత్తం 823 ఓట్లు పోల్ కాగా మొదటి రౌండ్లో 600 ఓట్లను లెక్కించారు. మొదటి రౌండ్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కవితకు భారీ ఆధిక్యాన్ని ప్రదర్శించారు. రెండవ రౌండ్లోనూ కవితదే పైచేయిగా మారింది . మొత్తం 823 ఓట్లను 728 ఓట్ల రికార్డు మెజారిటీని సాధించి కవిత తన సత్తా చాటారు. మొదటినుంచి కవిత ఎన్నిక లాంఛనప్రాయమే అని అందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ కాంగ్రెస్, బిజెపిలు ఎన్నికల బరిలోకి దిగి చివరకు డిపాజిట్లు సైతం కోల్పోయి పరువు పోగొట్టుకున్నాయి.
Recommended Video

భారీ మెజార్టీతో పట్టు సాధించిన కవిత .. ఇక నుండి రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా
ఎమ్మెల్సీ ఎన్నికల్లో అత్యంత భారీ మెజారిటీ సాధించి నిజామాబాద్లో స్థానికంగా ఉన్న పట్టును నిరూపించుకోవాలి అనుకున్న కవిత అనుకున్నట్టుగానే భారీ విజయాన్ని నమోదు చేశారు. ఒక పక్క కవిత నేడు కౌంటింగ్ సందర్భంగా నాంపల్లిలోని యూసుఫియన్ దర్గాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చాదర్ ను సమర్పించారు. రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుండి కేంద్ర రాజకీయాల్లో కీలకంగా పనిచేసిన కవిత ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించనున్నారు. త్వరలోనే ఆమెకు మంత్రి పదవి కూడా వరిస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications