అవునా అర్వింద్.. పసుపుబోర్డు కాదు స్పైసెస్ ఎక్స్‌టెన్షన్ బోర్డు అట..
నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు అంశంపై బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. తనపై వస్తున్న విమర్శలపై అర్వింద్ స్పందించారు. పసుపు బోర్డు కంటే మెరుగైనది స్పైసెస్ ఎక్స్ టెన్షన్ బోర్డు అని వెల్లడించారు. ఎక్స్ టెన్షన్ బోర్డు ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్రమంత్రి పార్లమెంటులో స్పష్టం చేశారని వెల్లడించారు. స్పైసెస్ ఎక్స్ టెన్షన్ బోర్డు వల్ల ఇప్పటికే చాలామంది లాభపడుతున్నారని అర్వింద్ వివరించారు.
పార్లమెంట్‌లో జరిగిన పరిణామాల నేపథ్యంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటేనని తేలిపోయిందని అర్వింద్ అన్నారు. ఎంపీ రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్‌కు దాసోహం అయ్యాడని విమర్శించారు. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి.. సీఎం కేసీఆర్ బ్రోకర్ గా వ్యవహరిస్తున్నాడని అర్వింద్ ఆరోపించారు. ఉత్తమ్ చలవ వల్లే కాంగ్రెస్ చాలావరకు ఖాళీ అయిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయిలో రాహుల్, రాష్ట్రస్థాయిలో ఉత్తమ్ అధ్యక్షులుగా ఉంటే తమకెంతో లాభదాయకం అని ఎద్దేవా చేశారు.

వాస్తవానికి 2019 లోక్ సభ ఎన్నికల్లో పసుపు బోర్డు ఏర్పాటు చేయిస్తామని అర్వింద్ మాట ఇచ్చారు. దీంతో ఆ పార్లమెంట్ నియోజకవర్గంలో గెలుపొందారు. సిట్టింగ్ ఎంపీ కవితను ఓడించారు. ఆ తర్వాత మాటే మరిచారు. దీనిపై ఎప్పుడు రైతులు ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఇటీవల తరచూ పసుపు బోర్డు గురించి ప్రస్తావన వస్తోంది. దీంతో స్పైసెస్ ఎక్స్ టెన్షన్ బోర్డు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.












Click it and Unblock the Notifications