నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అనారోగ్యమంటూ ఆస్పత్రికి.. కానిస్టేబుల్‌ను కొట్టి తుపాకీని లాక్కొని ఖైదీ పరార్, విస్తృత గాలింపు

|
Google Oneindia TeluguNews

నిజామాబాద్: అనారోగ్యానికి గురయ్యాడని ఆస్పత్రికి తీసుకువస్తే.. ఓ రిమాండ్ దారుణానికి తెగబడ్డాడు. కానిస్టేబుల్‌ను కొట్టి అతని తుపాకీని తీసుకుని పరారయ్యాడు.
నిజామాబాద్ పట్టణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ ఖైదీ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.

మూడు రోజుల క్రితం రాత్రి సమయంలో అనారోగ్యంగా ఉండటంతో ఖైదీ జీరకర్ర ప్రసాద్‌ను ఇద్దరు కానిస్టేబులు నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఇప్పటికే అక్కడ కరోనా వ్యాధి అనుమానితులు చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అదే సమయంలో సదరు ఖైదీ.. పక్కనున్న కానిస్టేబుల్‌పై దాడి చేసి, అతని తుపాకీని లాక్కొని పారిపోయాడు.

 Remand prisoner assaults cop, steals gun and escapes from govt hospital in Nizamabad.

అతని వెంట పరిగెత్తినప్పటికీ ఫలితం లేకపోయింది. వెంటనే అధికారులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు బాధిత కానిస్టేబుల్. దీంతో వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు, అధికారులు చేరుకున్నారు. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ఇచ్చి పలు పోలీసు బృందాలను ఖైదీ కోసం గాలింపు చేపట్టామని ఉన్నతాధికారులు ఆదేశించారు. మూడ్రోజులుగా వెతుకుతున్నా.. అతని ఆచూకీ లభించలేదు.

అయితే, ఖైదీ పారిపోవడానికి కారణమయ్యారనే అనుమానంతో ప్రసాద్ వెంట వెళ్లిన ఇద్దరు కానిస్టేబుళ్లపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ఖైదీ ప్రసాద్ పెద్ద నేర చరిత్రే ఉంది. నిజామాబాద్ నగరంలోని గౌతంనగర్‌కు చెందిన ఇతడు.. గత పదేళ్లుగా దొంగతనాలు, దోపిడీలకు పాల్పడుతున్నాడు.

మాక్లూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఇతడు ఎక్కువగా నేరాలకు పాల్పడినట్లు తెలిసింది. తన భార్యాపిల్లలకు దూరంగా ఉంటున్న ఇతడు.. పలు నేరాలకు పాల్పడి పోలీసులకు చిక్కకుండా తిరిగాడు. అయితే, పోలీసులు అతడ్ని ఎంతో శ్రమించి పట్టుకోగా.. కోర్టు ఆదేశాలతో అతడ్ని రిమాండ్‌కు సారంగపూర్ జైలుకు తరలించారు. మళ్లీ ఇలా తప్పించుకోవడంతో మరోసారి అలజడి నెలకొంది. అతని దగ్గర 10 రౌండ్ల బుల్లెట్లు ఉన్న తుపాకీ కూడా ఇప్పుడు ఉండటంతో స్థానికంగా ఆందోళనకర వాతావరణం నెలకొంది.

English summary
Remand prisoner assaults cop, steals gun and escapes from govt hospital in Nizamabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X