కదులుతున్న రైలు నుండి దూకిన విద్యార్థులకు తీవ్ర గాయాలు .. ఒకరి పరిస్థితి విషమం

ఓ చిన్న పొరబాటు ముగ్గురు విద్యార్థులను గాయాల పాలు చేసింది. ఎన్‌పిటిఈఎల్ పరీక్ష కోసం నిజామాబాద్ వెళ్లేందుకు రైలు ఎక్కిన ముగ్గురు విద్యార్థులు కదులుతున్న రైలు నుండి కిందకు దూకడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులు గాయపడ్డారు. ఒక విద్యార్థి తలకు తీవ్ర గాయాలు కావడంతో అతని పరిస్థితి విషమంగా ఉంది.

ఇక అసలు విషయానికొస్తే నిజామాబాద్ జిల్లా బాసరకు చెందిన ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు రైల్వే స్టేషన్ లో ప్రమాదం చోటుచేసుకుంది. కదులుతున్న ట్రైన్ నుండి ముగ్గురు ట్రిపుల్ ఐటీ విద్యార్థులు కిందకు దూకేశారు. మొత్తం 106 మంది విద్యార్థులు ఎన్‌పిటిఈఎల్ పరీక్ష రాయటానికి నిజామాబాద్ వెళ్లేందుకు బాసర నుండి బయలుదేరారు. అయితే వీరిలో ముగ్గురు అజంతా ఎక్స్ ప్రెస్ ఎక్కాల్సిన చోట పొరబాటుగా పర్భని ప్యాసింజర్ ఎక్కారు.

Serious injuries to students who jumped off a moving train .. Ones condition is critical

ట్రైన్ కదులుతుండగా తాము ఎక్కాల్సిన ట్రైను ఇది కాదని గుర్తించిన విద్యార్థులు పరీక్ష మిస్ అవుతామన్న టెన్షన్లో ట్రైన్ నుండి దూకేశారు. ట్రైన్ అప్పటికే రన్నింగ్లో ఉండగా విద్యార్థులు కిందకు దూకడంతో తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని రైల్వే సిబ్బంది ఆస్పత్రికి తరలించారు.ఈ ఘటనలో వరంగల్ జిల్లాకు చెందిన సాయి కుమార్ అనే విద్యార్థి తలకు తీవ్ర గాయాలు అయినట్లుగా తెలుస్తోంది. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో అతనిని నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు. రైలు ఎక్కే క్రమంలో చేసిన పొరపాటు, పరీక్ష మిస్ అవుతామన్న టెన్షన్ ప్రస్తుతం ఆ విద్యార్థి ప్రాణాల మీదికి తెచ్చింది. మరో ఇద్దరు విద్యార్థులు గాయపడేలా చేసింది. ఈ ఘటన బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులకు ఆవేదన కలిగిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+