వైసీపీ బోణీ కొట్టని ఆ నియోజకవర్గం

Kondapi Assembly Round up 2024: ప్రకాశం జిల్లాలోని కొండపి నియోజకవర్గం.. ఆసక్తికరమైన పోరుకు తెర తీసింది. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ- తెలుగుదేశం మధ్య హోరాహోరీ పోరు కొనసాగడం ఖాయంగా కనిపిస్తోందిక్కడ. ఇక్కడ వైసీపీ గెలిస్తే.. అది తొలిసారే అవుతుంది.

ప్రకాశం జిల్లాలోని ఒంగోలు లోక్‌సభ పరిధిలోని ఎస్సీ రిజర్వుడు సీటు కొండపి నియోజకవర్గం. సింగరాయకొండ, కొండపి, టంగుటూరు, జరుగుమల్లి, పొన్నలూరు, మర్రిపూడి మండలాలు దీని పరిధిలోకి వస్తాయి. సంఖ్యాపరంగా చూసినా, రాజకీయంగా చూసినా కమ్మ సామాజిక వర్గం ఓటు అధికంగా ఉంటుంది.

Can YSRCP win TDP in Kondapi

ఈ నియోజకవర్గంపై వారిదే ఆధిపత్యం కూడా. 2009 ముందు జనరల్ సీటుగా ఉండేది. నియోజకవర్గాల పునర్విభజన సమయంలో ఇది ఎస్సీ రిజర్వుడ్‌గా మారింది. జనరల్ సీటుగా ఉన్నప్పుడు మొత్తం 11 సార్లు ఎన్నికలు జరిగ్గా అన్ని సార్లూ కమ్మ సామాజిక వర్గం అభ్యర్థులే విజయం సాధించారు. అటు టీడీపీ, ఇటు కాంగ్రెస్ ఆ సామాజిక వర్గానికే టికెట్ ఇస్తూ వచ్చింది.

కమ్మ వారి తరువాత రెడ్డి, ఎస్సీ, మాదిగ, యాదవ, ముస్లిం సామాజిక వర్గాల ఓటు బ్యాంకు బలంగా ఉంటుంది. టీడీపీ ఆవిర్భవించక ముందు అయిదు ఎన్నికలు జరగ్గా.. నాలుగు సార్లు కాంగ్రెస్ విజయఢంకా మోగించింది. ఒక్కసారి అంటే 1972లో సీపీఐ విజయం సాధించింది.

టీడీపీ ఆవిర్భవించిన తరువాత ఆ పార్టీదే హవా. 1983 తరువాత తొమ్మిది సార్లు ఎన్నికలు జరిగాయి. అయిదు సార్లు టీడీపీ, నాలుగుసార్లు కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. కొండపి నుంచి గెలిచిన దామచర్ల ఆంజనేయులు మంత్రిగా పని చేశారు.

2009లో ఈ సీటు రిజర్వుడ్ అయింది. ఆ ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్ధి జీవీ శేషు జయకేతనం ఎగురవేశారు. టీడీపీకి చెందిన డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామిపై 5,164 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో వీరాంజనేయ స్వామి గెలిచారు. వైసీపీ అభ్యర్ధి జూపూడి ప్రభాకర్ రావుపై 5,440 ఓట్ల మెజారిటీతో గెలిచారు.

2019 ఎన్నికల్లోనూ కొండపి నియోజకవర్గంపై టీడీపీ జెండానే ఎగిరింది. వీరాంజనేయ స్వామి మరోసారి గెలిచారు. వైసీపీ అభ్యర్ధి మాదాసి వెంకయ్యపై 1,024 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఈ సారి మాత్రం వైసీపీ వ్యూహాన్ని మార్చింది. మంత్రి ఆదిమూలపు సురేష్‌ను ఇక్కడ అభ్యర్ధిగా ప్రకటించింది.

టీడీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే వీరాంజనేయ స్వామి, వైసీపీ నుంచి ఆదిమూలపు సురేష్ మధ్య.. ఉత్కంఠ భరితంగా పోరు ఉండటం ఖాయంగా కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+