Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

టీడీపీ నుంచి దగ్గుబాటి కుమారుడి పోటీ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!!

టీడీపీ అధినేత చంద్రబాబు వచ్చే ఎన్నికల దిశగా వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. గతం కంటే భిన్నంగా కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. రానున్న ఎన్నికలు టీడీపీకి - వ్యక్తిగతంగా చంద్రబాబుకు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. దీంతో..ప్రతీ సీటు విషయంలోనూ చంద్రబాబు ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. నిత్యం నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేస్తూ చర్చల్లో ఉన్న అంశాలపైన క్లారిటీ ఇస్తున్నారు. ఇప్పటికే వచ్చే ఎన్నికల్లో యువతకు 40 శాతం సీట్లు ఇవ్వనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. సీనియర్లు ఈ విషయంలో పెద్ద మనసుతో సహకరించాలని సూచించారు.

కీలక నిర్ణయాలు తీసుకుంటున్న చంద్రబాబు

కీలక నిర్ణయాలు తీసుకుంటున్న చంద్రబాబు


తాజాగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు తిరిగి టకెట్లు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. దీంతో..2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి 23 మంది గెలవగా, అందులో నలుగురు పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఇదే సమయంలో పార్టీలో చేరికల పైన చంద్రబాబు వేచి చూసే ధోరణితో వ్యవహరిస్తున్నారు. అందులో భాగంగా.. ఇప్పుడు ప్రకాశం జిల్లాలో సీట్ల కేటాయింపు పైన చంద్రబాబు క్లియర్ గా ఉన్నారు. 2019 ఎన్నికల్లో ప్రకాశం జిల్లా నుంచి నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. అందులో చీరాల నుంచి గెలిచిన సీనియర్ నేత కరణం బలరాం పార్టీకి దూరంగా ఉంటూ..వైసీపీకి దగ్గరయ్యారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి తన కుమారుడిని ఎన్నికల బరిలో దించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అదే సమయంలో చీరాల వైసీపీలో ఇద్దరు టికెట్ కోసం రేసులో ఉన్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిన ఆమంచి క్రిష్ణ మోహన్ తో పాటుగా పోతుల సునీత టికెట్ ఆశిస్తున్నారు.

దగ్గుబాటి వారసుడి ఎంట్రీ పై పరోక్షంగా

దగ్గుబాటి వారసుడి ఎంట్రీ పై పరోక్షంగా

టీడీపీ అధినేత చంద్రబాబు - దగ్గుబాటి వెంకటేశ్వర రావు మధ్య తిరిగి సత్సంబంధాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే దగ్గుబాటి తనయుడు హితేష్ పోటీ చేస్తారనే ప్రచారం సాగింది. గత ఎన్నికల సమయంలోనే హితేష్ వైసీపీ నుంచి పర్చూరు అభ్యర్ధిగా పోటీ చేయాలని భావించినా, ఆయన పౌరసత్వ అంశం కారణంగా సాధ్యపడలేదు. వచ్చే ఎన్నికల్లో దగ్గుబాటి తనయుడు టీడీపీ నుంచి పోటీ ఖాయమనే వాదన తెర మీదకు వచ్చింది. ఇప్పుడు ఇదే అంశం పైన చీరాల టీడీపీ నేతలు పార్టీ అధినేత వద్ద స్పష్టత కోరారు. చీరాల పార్టీ సమీక్షలో భాగంగా నియోజకవర్గ నేతలతో చంద్రబాబు సమీక్ష చేసారు. పార్టీలో చేరికల అంశం పైన చర్చలు జరిగాయి. అదే సమయంలో చీరాల పార్టీ ఇంచార్జ్​గా కొండయ్యను కొనసాగిస్తున్నట్లు చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పార్టీలో ఎవరు చేరినా.. కొండయ్యతో కలిసి పని చెయ్యాల్సిందే అని ఆయన తేల్చిచెప్పారు.

కొండయ్యకే చీరాల ఇంఛార్జ్ బాధ్యతలు

కొండయ్యకే చీరాల ఇంఛార్జ్ బాధ్యతలు

ఇతర పార్టీల నుంచి నేతలు వస్తున్నారని.. వారికే టిక్కెట్లు ఇవ్వడం అనే చర్చను చంద్రబాబు కొట్టిపారేశారు. దీని ద్వారా దగ్గుబాటి కుమారుడు పార్టీలో చేరబోతున్నారని..ఆయనకు చీరాల టికెట్ ఇస్తారనే ప్రచారానికి చంద్రబాబు ముగింపు పలికారు. ఇప్పటి వరకు పార్టీ కోసం పని చేస్తున్న వారికి ప్రాధాన్యత ఉంటుందని చంద్రబాబు తేల్చి చెబుతున్నారు. కొంత మంది ఇంఛార్జ్ లు తమకే పార్టీ టికెట్ ఖరారైందని ప్రచారం చేసుకోవటం పైనా టీడీపీ అధినాయకత్వం ఆగ్రహం తో ఉంది. ఇటువంటి ప్రచారం సహించేది లేదని ఇంఛార్జ్ లకు స్పష్టం చేస్తోంది. ఇక, మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్షలను పూర్తి చేసిన తరువాత కొత్త కార్యచరణ ప్రకటించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు సిద్దమవుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+