ఉక్రెయిన్‌లో ఒంగోలు విద్యార్థులు.. పేరంట్స్ విల విల, రహదారి మార్గం గుండా..
రష్యా యుద్దంతో ఉక్రెయిన్ అల్లాడిపోతోంది. అక్కడ విదేశాలకు చెందిన చాలా మంది ఉన్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు బిక్కుబిక్కుమంటున్నారు. దీంతో పేరంట్స్ తల్లడిల్లిపోతున్నారు. ఒంగోలు సాయిబాబా నగర్‌కు చెందిన సంపత్, బలరాంకాలనీకీ చెందిన పుట్టా సాయి లక్ష్మి జశ్వంత్, అద్దంకి నియోకవర్గంలో మరో ముగ్గురు విధ్యార్ధులు ఉక్రెయిన్‌లోనే ఉన్నారు.

పేరంట్స్ ఆందోళన
వీఎన్ కరాజీన్ కార్కివ్ వర్సిటీలో ఇద్దరు విధ్యార్ధులు ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. అక్కడి పరిస్థితుల నేపథ్యంలో తల్లిదండ్రులు బోరుమంటున్నారు. ఉదయం తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఆందోళన చెందొద్దని, నెట్ వర్క్ ఆగిపోతున్న కారణంగా శనివారం ఉదయం కాల్ చేస్తామని విద్యార్థులు తెలియచేశారు. నెట్ వర్క్ ఆగిపోవడం, వారి ఫోన్ నెంబర్లు పనిచేయక పోవడంపై కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

వీడియో..
ఉక్రెయిన్ నుంచి వీడియో సందేశాన్ని పంపారు. పరిస్థితుల నేపథ్యంలో ఏ క్షణాన ఏమి జరుగుతుందోననే ఆందోళన వ్యక్తమవుతుంది. భారత పౌరులను తరలించడంపై విదేశాంగమంత్రి ఏర్పాట్లు చేస్తోంది. యుద్ధం వల్ల ఉక్రెయిన్ ఎయిర్‌స్పేస్‌ను మూసివేశారు. దీంతో అక్కడి భారతీయులందరిని సమీప దేశాల్లోకి తరలించి అక్కడి నుంచి ఇండియా తరలించేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టారు. హంగేరిలోని భారత ఎంబసీ కీలక ప్రకటన చేసింది. ఉక్రెయిన్‌లోని భారతీయులు రోడ్డు మార్గంలో హంగేరి, రొమేనియా సరిహద్దులకు రావాలని సూచించింది.

రహదారి గుండా..
ఉక్రెయిన్‌లోని భారత విదేశాంగశాఖ అధికారుల సాయంతో భారతీయులు హంగేరి సరిహద్దులోని హుజూర్ద్, రొమేనియా సరిహద్దులోని చెర్నీవెస్ట్‌కు చేరుకోవాలని సూచించింది. విద్యార్థులు బృందాలుగా బయల్దేరాలని.. పాస్‌పోర్టులు, అత్యవసర ఖర్చుల కోసం కొంచెం డబ్బు, కావాల్సిన వస్తువులతో సిద్ధంగా ఉండాలని ప్రకటించింది. కరోనా డబుల్ వ్యాక్సిన్ సర్టిఫికేట్ మస్ట్ అని సూచించింది.తాము ప్రయాణిస్తున్న వాహనాలపై జాతీయ జెండాను మస్ట్‌గా ఉంచాలని సూచించింది భారత ఎంబసీ ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయుల వివరాలను ఇప్పటికే సేకరించింది. ప్రస్తుతం 16 వేల మంది భారతీయులు ఉన్నారని అంచనా వేస్తున్నారు. రష్యా దాడులతో భారతీయులకు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్లు, బాంబ్ షెల్టర్లు, హాస్టల్స్‌ల్లో తలదాచుకుంటున్నారు.












Click it and Unblock the Notifications