జగన్ కు ప్రకాశం టీడీపీ ఎమ్మెల్యేల మరో లేఖ-కేంద్ర గెజిట్ లో వెలుగొండకు అన్యాయంపై

కేంద్ర ప్రభుత్వం నిన్న విడుదల చేసిన గెజిట్ లో ప్రకాశం జిల్లాలోని వెలుగొండ ప్రాజెక్టుకి అన్యాయం జరిగిందంటూ సీఎం జగన్ కు ప్రకాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు, డోలా బాల వీరాంజనేయస్వామి మరో లేఖ రాశారు. ఇప్పటికే రాయలసీమ లిఫ్ట్ పై వీరు రాసిన లేఖ కలకలం రేపుతుండగా.. ఇప్పుడు ముగ్గురు ఎమ్మెల్యేలు మరో లేఖాస్త్రం సంధించారు.

కేంద్ర ప్రభుత్వం ప్రకాశం జిల్లాలోని వెలుగొండ ప్రాజెక్టుని గెజిట్ లో "అనుమతులు లేని ప్రాజెక్టుగా చేర్చడంపై టీడీపీ ఎమ్మెల్యేలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. 2014 నాటి విభజన చట్టం ప్రకారం వెలుగొండ ప్రాజెక్టుని నాడు కేంద్రం ఆమోదించి, అనుమతులు ఉన్న ప్రాజెక్టుగా చూపిందని, నేడు ఇలా అనుమతులు లేవు అని చెప్పడం సరికాదని సీఎం జగన్ కు రాసిన లేఖలో వారు ప్రస్తావించారు. విభజన చట్టంలోని 11వ షెడ్యూల్, 85 (7ఈ) ఆర్టికల్ ప్రకారం నాడు కేంద్రం తెలుగు రాష్ట్రాల్లోని ఆరు (తెలుగు గంగ, గాలేరు నగరి, హంద్రీనీవా, వెలుగొండ, నెట్టెంపాడు, కల్వకుర్తి) సాగునీటి ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలిపిందని.., కానీ నిన్న విడులా చేసిన గెజిట్ లో కేవలం అయిదు ప్రాజెక్టులను మాత్రమే 2014 విభజన చట్టం ప్రకారం చూపి. వెలుగొందని విస్మరించడంపై ఎమ్మెల్యేలు తీవ్ర అభ్యంతరం తెలిపారు.

prakasam district tdp mlas wrote ys jagan on ignoring velugonda project in centres gazette

కేంద్రం ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్ లో వెంటనే మార్పులు చేసి.., విభజన చట్టం ప్రకారం వెలుగొండకు ప్రాధాన్యత కలిగేలా చూడాలని.., సీఎం జగన్ ఈ బాధ్యత తీసుకోవాలని లేఖలో ఎమ్మెల్యేలు కోరారు. వెలుగొండ ప్రాజెక్టు భవిష్యత్తు అంధకారమవుతుందని, అటు సాగర్ నీరు రాక, ఇటు వెలుగొండ ఇలాంటి ఆటంకాలు ఉంటె ప్రకాశం జిల్లాలో నీటి ఎద్దడి మరింత తీవ్రమవుతుందంటూ లేఖలో ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. రాయలసీమ ఎత్తిపోతల ద్వారా 805 అడుగుల నీటి మట్టంలోనే నీటిని మళ్లించడం వలన వెలుగొండ, నాగార్జున సాగర్ ప్రాజెక్టులకు ఎదురవ్వనున్న నష్టాలను మరోసారి సీం జగన్ కు వారు వివరించారు. ప్రకాశం జిల్లాలో కరువు నేపథ్యంలో జిల్లాను ఆదుకోవాలని, సాగునీటి ప్రాజెక్టుల విషయంలో సీఎం వెంటనే స్పందించాలని కోరిన టీడీపీ ఎమ్మెల్యేలు సాంబశివరావు, రవికుమార్, స్వామి కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+