ఘోర రోడ్డు ప్రమాదం: సాగర్ కాల్వలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు, పెళ్లి బృందంలో ఏడుగురు మృతి
ప్రకాశం: జిల్లాలో సోమవారం అర్ధరాత్రి తర్వాత ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దర్శి సమీపంలో సాగర్ కాల్వలోకి పెళ్లి బృందం బస్సు దూసుకెళ్లడంతో ఏడుగురు మృతి చెందారు. మరో 12 మంది గాయపడ్డారు. బస్సు పొదిలి నుంచి కాకినాడ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 35 మంది నుంచి 45 మంది ఉన్నట్లు సమాచారం.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వివాహ రిసెప్షన్ కోసం కాకినాడ వెళ్లేందుకు పెళ్లి బృందం ఆర్టీసీ బస్సును అద్దెకు తీసుకుంది. క్రేన్ సాయంతో బోల్తా పడిన బస్సును బయటకు తీశారు.
కాగా, లారీ నీ తప్పించ బాయి క్రమంలో అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అయితే బస్సు ప్రమాదం జరిగే సమయంలో సాగర్ కెనాల్‌లో కాలువలో నీళ్లు లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ప్రస్తుతం సాగర్ కెనాల్ వద్ద దర్శి డీఎస్పి ఆధ్వర్యంలో బస్సును బయటకు తీసే పనులు వేగంగా జరిగాయి.

మరణించిన వారిని పొదిలి గ్రామానికి చెందిన అబ్దుల్ అజీజ్(65), అబ్దుల్ హాని(60), షేక్ రమీజ్(48), ముల్లా నూర్జహాన్(58), ముల్లా జానీబేగం(65), షేక్ షబీనా(35), షేక్ హీనా(6)గా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో గాయపడినవారిని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ప్రకాశం: సాగర్ కాలువలోకి దూసుకెళ్లిన పెళ్లి బృందం బస్సు.. ఏడుగురు మృతి#NagarjunaSagar #BusAccident #AndhraPradesh #AndhraNews #Oneindiatelugu pic.twitter.com/NyPxFlqDJ9
— oneindiatelugu (@oneindiatelugu) July 11, 2023
కాగా, ఆదివారం పొదిలిలో పెళ్లికూతురు ఇంటిదగ్గర పెళ్లి జరిగింది. మంగళవారం రోజు కాకినాడలో పెళ్ళికొడుకు ఇంటిదగ్గర రిసెప్షన్ (వలిమా) జరగాల్సి ఉంది. రిసెప్షన్ కోసమే బస్సులో బయలుదేరారు పెళ్ళికూతురు తరపు బంధువులు. పెళ్లికూతురు తండ్రి సిరాజ్, పెళ్ళికొడుకు తండ్రి మంజూర్ అహ్మద్ ఇద్దరూ సౌదీలో ఉద్యోగాలు చేస్తున్నారు. పిల్లల పెళ్లి కోసం స్వగ్రామాలకు వచ్చారు. ఇలాంటి ఆనందకర సమయంలో ఘోర బస్సు ప్రమాదం ఆ కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది.
సీఎం జగన్ దిగ్భ్రాంతి
ఆర్టీసీ బస్సు ప్రమాదంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభతి తెలిపారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications