ఒంగోలులో దారుణం... ఎస్సై స్టేషన్‌కు పిలుస్తున్నాడని తీసుకెళ్లి... యువతిపై అత్యాచారం
ఒంగోలులో దారుణం వెలుగుచూసింది. ఎస్సై పిలుస్తున్నాడంటూ ఓ యువతిని తన బైక్‌పై తీసుకెళ్లిన యువకుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధిత యువతి స్నేహితుడితో బయటకు వెళ్లిన సమయంలో నిందితుడు వారి బైక్‌ను ఫాలో అయి వేధించాడు. బెదిరింపులకు యువతి లొంగకపోవడంతో ఎస్సై పిలుస్తున్నాడని అబద్దం చెప్పి తీసుకెళ్లాడు. స్నేహితుల ప్రోద్బలంతో బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగుచూసింది.
వివరాల్లోకి వెళ్తే... ఒంగోలు జిల్లా కేంద్రానికి చెందిన యువతి ఇటీవల తన స్నేహితుడితో కలిసి బయటకు వెళ్లింది. ఇద్దరు బైక్‌పై వెళ్తున్న సమయంలో ఓ యువకుడు వారిని అనుసరించాడు. ఒకచోట బైక్‌ను అడ్డగించి యువతిని బెదిరించాడు. ఆమె ఫోటోలు,వీడియోలు తన వద్ద ఉన్నాయని... వాటిని ఆమె ఇంట్లోవాళ్లకు చూపిస్తానని బెదిరించాడు. అయితే ఆ యువతి అతని బెదిరింపులకు భయపడలేదు.

తానే తప్పు చేయలేదని ఆమె గట్టిగా బదులిచ్చింది. దీంతో వెంటనే మాట మార్చిన సదరు వ్యక్తి... ఎస్సై పిలుస్తున్నాడని... స్టేషన్‌కు రావాలని చెప్పాడు. లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించాడు. భయపడ్డ ఆ యువతి అతని బైక్ ఎక్కింది. ఆపై యువతిని అతను కొత్త మామిడిపాలెం రోడ్డు వైపు తీసుకెళ్లాడు. అక్కడే ఓ నిర్మానుష్య ప్రదేశంలో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెను ఇంటి వద్ద వదిలేశాడు.
Recommended Video
బాధిత యువతి అత్యాచార విషయం ఎవరికి చెప్పుకోలేక తనలో తానే కుంగిపోయింది. చివరకు స్నేహితుల ప్రోద్బలంతో గురువారం(మే 27) స్థానిక దిశ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితుడు గతంలోనూ ఇలాంటి నేరాలకు పాల్పడ్డాడా అన్న కోణంలో విచారిస్తున్నారు. అతనిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.కోవిడ్ నేపథ్యంలో రాష్ట్రంలో నేరాలు తగ్గాయని భావిస్తున్నప్పటికీ... అక్కడక్కడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం ఆందోళన రేకెత్తిస్తోంది.












Click it and Unblock the Notifications