Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆ నియోజకవర్గంలో వైసీపీ- టీడీపీ ఆసక్తికరపోరు

Yerragondapalem Assembly round up 2024: ఈ ఎన్నికల సంగ్రామంలో ఆసక్తి కలిగించే అసెంబ్లీ నియోజకవర్గం.. ప్రకాశం జిల్లాలోని యర్రగొండపాలెం. ఒంగోలు లోకసభ పరిధిలోకి వచ్చే ఎస్సీ రిజర్వుడ్ స్థానం ఇది. యర్రగొండపాలెం, పుల్లలచెరువు, త్రిపురాంతకం, పెద ఆరవీడు, దోర్నాల మండలాలు దీని పరిధిలోకి వస్తాయి. మొత్తం 2,00,379 మంది ఓటర్లు ఉన్నారిక్కడ.

ఈ నియోజకవర్గం 1955 నుండి 1972 వరకు జనరల్ నియోజకవర్గంగా ఉండేది. 1978లో నియోజకవర్గాల పునర్విభజనలో రద్దయింది. దాని స్థానంలో కంభం అసెంబ్లీ స్థానంగా ఆవిర్భవించింది. 2004 ఎన్నికల వరకు కంభం అసెంబ్లీ మనుగడలో కొనసాగింది. 2009 నియోజకవర్గాల పునర్విభజన సమయంలో కంభం రద్దయి.. యర్రగొండపాలెం తెరమీదికి వచ్చింది.

YSRCP and TDP faceoff in Yerragondapalem Assembly segment in Prakasam

సంఖ్యాపరంగా రెడ్డీల సామాజికవర్గం అధికం ఉంటుంది. ఆ తరువాత ఎస్సీలు, యాదవులు, ముస్లిం, ఎస్టీ ఓటర్లు ఉంటారు. 1952లో కంభం నియోజకవర్గంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ నుంచి పిడతల రంగారెడ్ గెలిచారు. ఆ తరువాత 1955 నుంచి 1972 వరకు ఒక ఉప ఎన్నికతో సహా అయిదు ఎన్నికలు జరిగాయి.

ఇందులో రెండుసార్లు సీపీఐ అభ్యర్ధి పూల సుబ్బయ్య గెలిచారు. కాంగ్రెస్ మూడుసార్లు విజయం సాధించింది. 1978 నుంచి 2004 వరకు కంభం నియోజకవర్గంగా మారింది. 2004 వరకు ఏడుసార్లు కంభంలో ఎన్నికలు జరగ్గా.. అయిదు సార్లు కాంగ్రెస్, రెండు సార్లు టీడీపీ అభ్యర్థులు ఇక్కడ ఘన విజయం సాధించారు.

కాంగ్రెస్ అభ్యర్ధిగా కందుల నాగార్జున రెడ్డి మూడుసార్లు గెలిచారు కంభంలో. 2009 ఎన్నికల సమయంలో ఎస్సీ రిజర్వుడ్‌గా మారింది. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఆదిమూలపు సురేష్ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, టీడీపీ అభ్యర్ధి పాలపర్తి డేవిడ్ రాజుపై 13,194 ఓట్ల మెజారిటీతో గెలిచారు.

2014 ఎన్నికల్లో పాలపర్తి డేవిడ్ రాజు గారు వైఎస్ఆర్సీపీలో చేరారు. టీడీపీకి చెందిన బూదల అజిత రావుపై 19,071 ఓట్ల మెజారిటీతో విజయఢంకా మోగించారు. 2019 ఎన్నికల్లో ఆదిమూలపు సురేష్ ఇక్కడ తిరుగులేని మెజారిటీతో జెండా పాతారు. టీడీపీ అభ్యర్ధి అజిత రావు ఏకంగా 31,632 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు.

2024 ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ అభ్యర్థులను మార్చివేసింది. ఆదిమూలపు సురేష్ కొండపికి షిఫ్ట్ అయ్యారు. ఇక్కడ తాటిపర్తి చంద్రశేఖర్‌ను బరిలోకి దించింది వైసీపీ. టీడీపీ కొత్త అభ్యర్థిని తెర మీదికి తీసుకొచ్చింది. గూడూరి ఎరీక్షణ్ బాబుకు టికెట్ ఇచ్చింది. ఇద్దరిలో ఎవరు గెలుస్తారనేది ఆసక్తి రేపుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+