• search
  • Live TV
పులివెందుల వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

తెల్ల‌వారు జాము చ‌ర్చ‌లు :జ‌గ‌న్ తేల్చిందేంటి : 2014 కాదు.. 2019 అంటూ సీరియ‌స్‌..!

|

వైసిపి అధినేత జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర ముగియ‌టంతో..ఇక అభ్య‌ర్ధుల ఎంపిక పై దృష్టి సారించారు. ఇందు కోసం ప్ర‌తీ రోజు తెల్ల‌వారు జాము వ‌ర‌కు చ‌ర్చ‌లు..మంత‌నాలు సాగిస్తున్నారు. ఇడుపుల‌పాయ వేదిక‌గా జ‌గ‌న్ పార్టీ కీల‌క నేత‌ల‌తో అభ్య‌ర్దుల ఎంపిక పై క‌స‌ర‌త్తు చేసారు. ఈ మంత‌నాల్లో జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యాలేంటి..అక్క‌డ అభ్య‌ర్ధులు ఖ‌రారు అ యిన‌ట్లేనా..జ‌గ‌న్ అమ‌లు చేస్తున్న స‌మీక‌ర‌ణాలేంటి..

తెల్ల‌వారు జాము దాకా చ‌ర్చ‌లు..ఎంపీగా వివేకా..!

తెల్ల‌వారు జాము దాకా చ‌ర్చ‌లు..ఎంపీగా వివేకా..!

పాద‌యాత్ర ముగించుకొని ఇడుపుల‌పాయ చేరుకున్న జ‌గ‌న్ కొత్త త‌ర‌హా రాజ‌కీయానికి తెర తీసారు. క‌డ‌ప జిల్లా వ్యాప్తం గా అనేక మంది టిక్కెట్ ఆశావాహులు..సిట్టింగ్ ఎమ్మెల్యేలు.. పార్టీ నేత‌లు జ‌గ‌న్ తో స‌మావేశ‌మ‌య్యారు. ఇదే జిల్లాలో అభ్య‌ర్దుల ఖ‌రారు పై బాబాయ్ వివేకానంద‌రెడ్డి తో జ‌గ‌న్ సుదీర్ఘంగా భేటీ అయ్యారు. తెల్ల‌వారుజాము వ‌ర‌కు మంత‌నా లు సాగించారు. జిల్లాలోని అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో దాదాపు అభ్య‌ర్ధుల ఎంపిక ప్ర‌క్రియ పూర్త‌యిన‌ట్లు స‌మాచారం. ఇక, ఎంపి అవినాశ్ రెడ్డి వ్య‌వ‌హారం పైనే జ‌గ‌న్ ఇంకా ఓ నిర్ణ‌యానికి రాలేద‌ని తెలుస్తోంది. అవినాశ్ ను అసెంబ్లీకి పంపాల ని యోచిస్తున్న జ‌గ‌న్ అందు కోసం ఎక్క‌డి నుండి బరిలోకి దింపాల‌నే అంశం పై దృష్టి పెట్టారు. అదే స‌మ‌యంలో అవినాశ్ ను అసెంబ్లీకి పంపిస్తే..క‌డ‌ప లోక్‌స‌భ నుండి వివేకానంద‌రెడ్డిని మ‌రో సారి బ‌రిలోకి దించుతారా అనే చ‌ర్చ పార్టీలో మొద‌లైంది. ఎమ్మెల్సీ గా కొద్ది రోజుల క్రితం ఓడిపోయిన వివేకాను ఎంపిగా గెలిపించి టిడిపికి స‌మాధానం చెప్పాల‌ని జ‌గ‌న్ భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. దీని పై పూర్తి స్థాయిలో ఇంకా నిర్ణ‌యం తీసుకోలేదు.

జ‌మ్మ‌ల మ‌డుగు అభ్య‌ర్ధి ఖ‌రారు...

జ‌మ్మ‌ల మ‌డుగు అభ్య‌ర్ధి ఖ‌రారు...

ఇక త‌న సొంత జిల్లాలో జ‌మ్మ‌లమ‌డుగు పై జ‌గ‌న్ ఈ సారి స్పెష‌ల్ ఫోక‌స్ పెట్టారు. 2014 లో జ‌మ్మ‌ల‌మడుగు నుండి ఆదినారాయ‌ణ రెడ్డి గెలిచారు. ఆయ‌న ఆ త‌రువాతి కాలంలో టిడిపిలోకి ఫిరాయించి టిడిపి లో చేరారు. మంత్రిగా ప్ర‌స్తుతం కొన‌సాగుతున్నారు. జ‌గ‌న్ పై ప్ర‌తీ సంద‌ర్భంలో విమ‌ర్శ‌లు తీవ్ర స్థాయిలో చేస్తూనే ఉన్నారు. దీంతో.. ఆ నియోజ‌క‌వ‌ర్గం నుంటి ఆది నారాయ‌ణ‌రెడ్డి పోటీ చేసినా..క‌డ‌ప ఎంపీగా బ‌రిలో దిగినా..జ‌గ‌న్ త‌న అభ్య‌ర్ధుల‌ను సిద్దం చేస్తున్నారు. ఎలాగైనా ఆది నారాయ‌ణ‌రెడ్డి గెల‌వ‌కూడ‌ద‌నేది జ‌గ‌న్ ల‌క్ష్యంగా క‌నిపిస్తోంది. దీని కోసం ప్ర‌స్తుతం అక్క‌డ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా ఉన్న డాక్ట‌ర్ సుధీర్‌రెడ్డి తన అనుచరులతో వైసీపీ కార్యాలయానికి వచ్చారు. అదే సమయంలో జగన్‌ బయటకు వచ్చి వారితో మాట్లాడుతుండగా సుధీర్‌రెడ్డి అనుచరులు పార్టీ తరపున అసెంబ్లీ అభ్యర్థిని ప్రకటించాలని పెద్దఎత్తున నినాదాలు చేశారు. దీంతో జగన్‌ స్పందించి మీ అభ్యర్థి సుధీర్‌రెడ్డి అంటూ ప్రకటించారు.

2014 కాదు..2019..జ‌గ‌న్ వ్యాఖ్య‌ల్లో ప‌ర‌మార్ధం..!

2014 కాదు..2019..జ‌గ‌న్ వ్యాఖ్య‌ల్లో ప‌ర‌మార్ధం..!

కొన్ని నియోజక‌వ‌ర్గాల్లో అభ్య‌ర్ధుల ఖ‌రారు పై పార్టీలోని కొంద‌రు సీనియ‌ర్లు జ‌గ‌న్ పై ఒత్తిడి తీసుకొచ్చే ప్ర‌య‌త్నం చే స్తున్నారు. అయితే, జ‌గ‌న్ మాత్రం ఎక్క‌డా ఒత్తిడికి లొంగటం లేదు. 2014 లో ఇదే విధంగా కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో బం ధువులు..సీనియ‌ర్ నేత‌లు..త‌న‌తో ఉన్న‌వారు అనే కార‌ణాల‌తో నియోజ‌క‌వ‌ర్గాల్లో వారి బ‌లాబ‌లాలు బేరీజు వేసుకోకుం డా సీట్లు ఇచ్చి..దెబ్బ తిన్న విష‌యాన్ని జ‌గ‌న్ ప‌రోక్షంగా నేత‌ల‌కు చెబుతున్నారు. పూర్తిగా తాను చేయించుకున్న స‌ర్వే నివేదిక‌ల ఆధారంగా..అక్క‌డి సామాజిక స‌మీక‌ర‌ణాలు..టిడిపి బ‌లం - బ‌ల‌హీన‌త‌ల ఆధారంగా మాత్ర‌మే పార్టీ అభ్య‌ర్ది ఖ‌రార‌వుతార‌ని జ‌గ‌న్ స్ప‌ష్టం చేస్తున్నారు. అభ్య‌ర్ధిగా ఖరారు కావాలంటే గెలుపే ప్రామాణిక‌మ‌ని తేల్చి చెబుతు న్నారు జ‌గ‌న్‌. నెల్లూరు జిల్లా కావ‌లి లో టిడిపిని దెబ్బ తీసేందుకు అక్క‌డి నేత‌ల‌తో జ‌రుగుతున్న మంత‌నాల‌ను వైసిపి నెల్లూరు ఇన్‌ఛార్జ్ లు జ‌గ‌న్ కు వివ‌రించారు. అయితే, జ‌గ‌న్ మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యేల విష‌యంలో మార్పు ఉండ‌ద‌ని తేల్చి చెప్పిన‌ట్లు స‌మాచారం.

English summary
YS Jagan continues discussions with party leaders about contesting party candidates conforming process. YS Viveka may YCP MP candidate from Kadapa. Jagan also taken decision on Jammalamadugu and Kovuru.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X