• search
 • Live TV
రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

బోటులో కుళ్లిపోయిన మృతదేహాలు: గుర్తు పట్టలేని విధంగా: బయటపడుతున్న డెడ్ బాడీలు..!

|
  Dharmadi Satyam Team Extracted The Boat From Godavari || 8 రోజుల తరువాత బయటకొచ్చిన రాయల్ వశిష్ఠ

  దాదాపు 40 మందికి పైగా పొట్టన పెట్టుకున్న రాయల్ వశిష్ఠ బోటు ఎట్టకేలకు బయటకు వచ్చింది. ధర్మాడి సత్యం బృందం ఈ ఆపరేషన్‌‌ను సక్సెస్ చేసింది. సెప్టెంబర్ 15న కచ్చులూరు వద్ద గోదావరిలో బోటు మునిగిన ఈ బోటు కారణంగా..39 మంది మృతి చెందగా, 26 మంది సురక్షితంగా బయటపడ్డారు. ఇంకా 12 మంది ఆచూకీ లభించలేదు. ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసిన తరువాత చివరకు ధర్మాడి సత్యం బృందం ఇందులో సక్సెస్ అయింది. అయితే బోటు పూర్తిగా శిధిలావస్థలో ఉంది. అందులోని ఏసీ గదిలో అయిదు మృతదేహాలు లభ్యమయ్యాయి. అయితే, అవి కుళ్లిపోయిన పరిస్థితుల్లో కనిపిస్తున్నాయి. నీరు లోపలికి ఇంకి శరీరాలు ఉబికి పోయాయి.

   38రోజుల తరువాత రాయల్ వశిష్ఠ బోటు

  38రోజుల తరువాత రాయల్ వశిష్ఠ బోటు

  38రోజుల తరువాత రాయల్ వశిష్ఠ బోటు బయటకు వచ్చింది. సెప్టెంబర్ 15న రాజమండ్రి నుండి పాపి కొండలకు వెళ్లేందుకు విహార యాత్రం కోసం ఈ బోటు ఎక్కిన అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ వెంటనే స్థానికులు కొందరిని కాపాడగా..మరి కొన్ని మృతదేహాలు తరువాత బయట పడ్డాయి. అయితే బోటు మాత్రం బయటకు రాలేదు. దీంతో..ప్రభుత్వం ఎలాగైనా బోటు బయటకు తీసుకొస్తామని చెబుతూ వచ్చింది. అందులో భాగంగా ధర్మడి సత్యానికి ఈ కాంట్రాక్టు అప్పగించారు. దాదాపు 20 రోజుల కష్టం తరువాత ప్రతికూల పరిస్థితుల్లో ఎట్టకేలకు బోటును బయటకు తీసారు.

  ఆపరేషన్‌‌ను సక్సెస్ చేసిన ధర్మాడి సత్యం బృందం

  ఆపరేషన్‌‌ను సక్సెస్ చేసిన ధర్మాడి సత్యం బృందం

  ధర్మాడి సత్యం బృందం ఈ ఆపరేషన్‌‌ను సక్సెస్ చేసింది. బోటును సత్యం టీమ్ నీళ్లపైకి తెచ్చింది. నీటి అడుగుభాగం నుంచి రోప్‌ల సాయంతో వెలికితీశారు. అయితే వశిష్ట బోటు పూర్తిగా ధ్వంసమైంది. దీంతో బోటుకు సంబంధించిన విడిభాగాలను బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. బోటు బయటకు తీస్తుండగా అందులో నుంచి దుర్వాసన వస్తోంది. బోటులో ఉన్న మృతదేహాలు కుళ్లిపోవడం వల్లే దుర్వాసన వస్తోందని అధికారులు చెబుతున్నారు.

   కుటుంబాలకు పది లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా

  కుటుంబాలకు పది లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా

  ప్రమాదంలో గల్లంతైన వారి కోసం వారి బంధువులు దాదాపు వారం రోజుల నిరీక్షణ తరువాత తమ వారు ఇక దక్కరని గుండె బరువుతో తిరిగి వెళ్లిపోయారు. తమ వారి వివరాలు చెప్పి..వారి డెత్ సర్టిఫికెట్లు ఇవ్వాలని కోరారు. దీనికి ప్రభుత్వం సైతం అంగీకరించి వారికి డెత్ సర్టిఫికెట్లు జారీ చేసింది. మరణించిన వారి కుటుంబాలకు పది లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా అందించగా..భీమా సంస్థ ద్వారా మరో పది లక్షలు అందించారు. ఈ ప్రమాదంలో మరణించిన వారు ఎక్కువగా తెలంగాణ ప్రాంతానికి చెందిన వారే కావటంతో ఆ ప్రభుత్వ మంత్రులు సైతం తొలి రెండు రోజుల్లో సహాయక చర్యల్లో పాల్గొన్నారు.

  ప్రమాద సమయంలో బోటులో దాదాపు 77 మంది

  ప్రమాద సమయంలో బోటులో దాదాపు 77 మంది

  ప్రమాద సమయంలో బోటులో దాదాపు 77 మంది ఉన్నట్లుగా చెబుతున్నారు. అందులో 39 మంది మరణించినట్లుగా అధికారికంగా ప్రకటించారు. 26 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఇకం,ా ఇంకా 12 మంది ఆచూకీ లభించలేదు. అందులో ఇప్పుడు బోటు తీసిన సమయంలో బోటులో కుళ్లిపోయిన పరిస్థితుల్లో అయిదు శరీరాలు కనిపిస్తున్నాయి. అయితే వాటిని గుర్తు పట్టే పరిస్థితి మాత్రం లేదు. బోటు పూర్తిగా ఒడ్డు వద్దకు తీసుకొచ్చిన తరువాత బోటు శిధిలాల మధ్య ఇంకా ఏమైనా మృతదేహాలు ఉన్నాయా అని అధికారులు క్షుణ్నంగా వెతుకుతున్నారు. గాలింపు సమయంలో మృతదేహాలు ఒక్కోక్కటిగా బయటకు వస్తున్నాయి. ఆ ప్రాంతానికి ఉన్నతాధికారులు చేరుకుంటున్నారు.

  English summary
  many dead Undeniably bodys found in boat royal vasishta.Dharmadi satyam team success in found the boat capsized in River Godavari and bought up the boat out side. After 38 days boat come out with heavy struggle. This boat capsized leading to the death of several tourists.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more