శుభ్‌మన్ గిల్‌పై కొరడా- ఐసీసీ సంచలన నిర్ణయం

లండన్: లండన్‌లోని కెన్సింగ్టన్ ఓవల్‌ స్టేడియంలో ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్‌లో ఘోర పరాజయాన్ని చవి చూసిన భారత జట్టుకు మరో షాక్ తగిలింది. ఈ ఓటమి నుంచి తేరుకోకముందే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. టీమిండియా డాషింగ్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌పై కొరడా ఝుళిపించింది.

డబ్ల్యూటీసీ ఫైనల్స్‌లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ 209 పరుగుల తేడాతో చిత్తయిన విషయం తెలిసిందే. చివరి రోజు- ఆస్ట్రేలియా బౌలర్ల ధాటికి టీమిండియా బ్యాటర్లు చేతులెత్తేశారు. ఆస్ట్రేలియా నిర్దేశించిన 444 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో నాలుగో రోజే తడబడింది భారత్. చివరి రోజు కనీసం ప్రతిఘటన కూడా చేయకుండానే బౌలర్లకు సరెండర్ అయింది. 234 పరుగులకు ఆలౌట్ అయింది.

Shubman Gill fined for tweet over Cameron Green’s catch

ఈ మ్యాచ్‌ మొత్తానికీ అత్యంత వివాదాస్పదమైన ఉదంతం- టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ అవుట్ అయిన విధానం. రెండో ఇన్నింగ్‌లో ఆసీస్ స్పీడ్‌స్టర్ స్కాట్ బోలాండ్ బౌలింగ్‌లో అతను వెనుదిరిగాడు. ఎక్స్‌ట్రా బౌన్స్‌తో దూసుకొచ్చిన గుడ్ లెంగ్త్ బంతి.. నేరుగా శుభ్‌మన్ గిల్ బ్యాట్ ఎడ్జ్‌ను తీసుకుని స్లిప్స్‌లోకి గాల్లోకి ఎగిరింది. థర్డ్ స్లిప్స్‌లో ఉన్న కామెరాన్ గ్రీన్ ఎడమ వైపునకు డైవ్ చేస్తూ బంతిని అందుకున్నాడు.

ఆ క్రమంలో బంతి నేలకు తాకిందనే వాదనలు ఉన్నాయి. దీనికి సంబంధించిన కొన్ని వీడియోలు, వాటి స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. థర్డ్ అంపైర్ కళ్లు మూసుకుని అవుట్ ఇచ్చాడా? అంటూ టీమిండియా అభిమానులు భగ్గుమన్నారు. బంతి నేలను తాకిందనేది స్పష్టంగా తేలినప్పటికీ.. ఎలా అవుట్ ఇచ్చాడంటూ ఈ ప్లాట్‌ఫామ్స్ వేదికగా ప్రశ్నించారు.

థర్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయానికి శుభ్‌మన్ గిల్ కూడా హర్ట్ అయ్యాడు. తన అధికారిక ట్విట్టర్‌ అకౌంట్‌లో దీనికి సంబంధించిన ఓ స్క్రీన్ షాట్‌ను పోస్ట్ చేశాడు. నిరాశతో కూడిన ఎమోజీని సింబల్‌గా పెట్టాడు. ఈ పోస్ట్ పెట్టినందుకు గిల్‌పై కొరడా ఝుళిపించింది ఐసీసీ. భారీగా జరిమానాను విధించింది. థర్డ్ అంపైర్ నిర్ణయాన్ని తప్పుపట్టినట్టుగా భావించింది. దీన్ని తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది.

థర్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయం పట్ల అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో శుభ్‌మన్ గిల్‌పై 115 శాతం జరిమానాను విధించింది. థర్డ్ అంపైర్ నిర్ణయం తరువాత కూడా గ్రౌండ్ నుంచి కదలకపోవడం వల్ల స్లోఓవర్ రేట్‌ నమోదైందని ఐసీసీ నిర్ధారింది. దీనితో అతనికి దక్కాల్సిన మ్యాచ్ ఫీజులో వంద శాతం కోత పెట్టింది. అలాగే థర్డ్ అంపైర్ నిర్ణయాన్ని తప్పుపట్టడం వల్ల మరో 15 శాతం జరిమానాను దీనికి జోడించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+