శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శ్రీకాకుళం జిల్లా క్వారంటైన్‌లో ప్రసవం: ప్రకాశం వలస కూలీ వేదన..క్వారంటైన్ల గురించి.. !

|
Google Oneindia TeluguNews

శ్రీకాకుళం: జీవనోపాధి కోసం జిల్లాలకు జిల్లాలను దాటుకుని వచ్చిన ఓ కరోనా వైరస్ అనుమానితురాలు ప్రసవించారు. ప్రకాశం జిల్లా నుంచి పొట్ట చేతబట్టుకుని ఒడిశా వెళ్లడానికి బయలుదేరిన ఆమె లాక్‌డౌన్ వల్ల శ్రీకాకుళంలో చిక్కుకుపోయారు. అదే సమయంలో కరోనా వైరస్ లక్షణాలు కనిపించడంతో ఆమెను శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌కు తరలించారు. అప్పటికి ఆమె నిండుగర్భిణి.

సుమారు 12 రోజులుగా పాలకొండ క్వారంటైన్‌లో ఉంటోన్న ఆమెకు నొప్పులు ఆరంభం కావడంతో అధికారులు శ్రీకాకుళంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమె ప్రసవించారు. ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే జిల్లా కలెక్టర్‌ జే నివాస్‌ ఆసుపత్రికి వెళ్లారు. ఆ మహిళ ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అప్పుడే జన్మించిన ఆడపిల్లకు కూడా వైద్య పరీక్షలను నిర్వహించాలని ఆదేశించారు. పుట్టిన బిడ్డ సంరక్షణకు 25 వేల రూపాయలను అందజేశారు.

Andhra Pradesh: Woman gives birth a baby in Palakonda quarantine centre in Srikakulam district

క్వారంటైన్‌లో వైద్య సహాయం, వసతుల గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు. సోషల్ డిస్టెన్సింగ్‌ను పాటిస్తున్నారా? లేదా? ఆరా తీశారు. ఏ జిల్లా నుంచి వచ్చారని, ఎక్కడికి వెళ్తున్నారని ప్రశ్నించారు. దీనికి ఆ మహిల.. ప్రకాశం జిల్లా గిద్దలూరు ప్రాంతానికి చెందిన తాను వసల కూలీగా జీవినాన్ని కొనసాగిస్తున్నానని, కూలీ పనుల కోసం ఒడిశా వెళ్లాల్సి ఉందని అన్నారు. లాక్‌డౌన్ వల్ల ఇక్కడే చిక్కుకుపోయినట్లు చెప్పారు. దీనిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకునేంత వరకూ క్వారంటైన్‌లోనే ఉండాలని సూచించారు.

కరోనా వైరస్ అనుమానితులను ప్రభుత్వం క్వారంటైన్లలో ఏ లోటు రాకుంా చూసుకుంటుందని అన్నారు. అవసరమైన వైద్య సదుపాయాన్ని, పౌష్టికాహారాన్ని అందిస్తున్నామని చెప్పారు. కరోనా వైరస్ సోకనప్పటికీ.. వైద్య పరీక్షలను చేయించుకోవడం తప్పనిసరి అవుతుందని, దీన్ని సమర్థవంతంగా నిర్వహించాల్సి ఉంటుందని జిల్లా కలెక్లర్ జే నివాస్ ఆదేశించారు. ఎలాాంటి లోటుపాట్లు ఎదురైనప్పటికీ.. తనను సంప్రదించాలని సూచించారు.

English summary
Woman gives birth a baby in Palakonda quarantine centre in Srikakulam district of Andhra Pradesh. After getting information Collector J Nivas visited the quarantine centre and hand over a baby kit to the woman.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X