ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: న‌ర‌స‌న్న‌పేట నియోజ‌క‌వ‌ర్గం గురించి తెలుసుకోండి

2009 నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌లో భాగంగా న‌ర‌స‌న్న‌పేట‌, జ‌లుమూరు, సార‌వ‌కోట‌, పోలాకి మండ‌లాల‌తో క‌లిపి ఈ న‌ర‌స‌న్న‌పేట నియోజ‌క‌వ‌ర్గం ఏర్ప‌డింది. 2009 వ‌ర‌కు ఉన్న‌హ‌రిశ్చంద్ర‌పురం 2009 లో ర‌ద్దు అయింది. హ‌రిశ్చంద్రా పురం కింజ‌ర‌పు కుటుంబానికి పెట్ట‌ని కోట లాంటిది. ఆ నియోజ‌క‌వ‌ర్గం నుండి కింజ‌ర‌పు ఎర్రంనాయుడు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అందులో ఒక‌సారి స్వ‌తంత్ర అభ్య‌ర్ధిగానూ గెలుపొందారు. ఆయ‌న సోద‌రుడు అచ్చంనాయుడు ఇదే నియోజ‌క‌వ‌ర్గం నుండి మూడు సార్లు గెలుపొందారు. ఎర్రం నాయుడు శ్రీకాకుళం లోక‌స‌భ నుండి నాలుగు సార్లు ఎంపి గా గెలిచి..కేంద్ర మంత్రిగా ప‌ని చేసారు. ఆయ‌న ఎన్టీఆర్ త‌న‌యుడు జ‌య‌కృష్ణ పై గెలుపొందారు. 2014 ఎన్నిక‌ల ముందు ఎర్రంనాయుడు రోడ్డు ప్ర‌మాదంలో మ‌ర‌ణించ‌టం తో..ఆయ‌న కుమారుడు రాజ‌కీయ రంగ ప్ర‌వేశం చేసారు.

న‌ర‌స‌న్న పేట‌లో 14 సార్లు ఎన్నిక‌లు..
శ‌రిహ్చంద్ర‌పురం నియోజ‌క‌వ‌ర్గంలో కింజ‌ర‌పు సోద‌రుల హ‌వా కొన‌సాగితే.. న‌ర‌స‌న్న‌పేట లో ధ‌ర్మాన సోద‌రులు గెలిచా రు. ఇక్క‌డ మొత్తంగా 14 సార్లు ఎన్నిక‌లు జ‌రిగితే అందులో కాంగ్రెస్ ఏడు సార్లు, టిడిపి నాలుగు సార్లు, స్వతంత్ర పార్టీ రెండు సార్లు, కెఎల్‌పి పార్టీ ఒక‌సారి గెలిచాయి. 2014 లో జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో వైసిపి గెలిచింది. మాజీ మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రా వు ఇక్క‌డి నుండి 1999 లో గెలిచారు. ఆ త‌రువాత వ‌రుస‌గా మూడు సార్లు ధ‌ర్మాన కృష్ణ‌దాస్ విజ‌యం సాధిం చారు. 2009 ఎన్నిక‌ల వ‌ర‌కు కాంగ్రెస్ నుండి గెలిచిన ధ‌ర్మాన కృష్ణ‌దాస్ 2012 లో జ‌గ‌న్ పార్టీలో చేరారు. ఆయ‌న పై అన ర్హ‌త వేటు ప‌డటంతో 2012లో జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో వైసిపి నుండి గెలుపొందారు. ఇక‌, 2014 ఎన్నిక‌ల స‌మ‌యానికి ఈ నియోజ‌క‌వ‌ర్గంలో స‌మీక‌ర‌ణాలు మారిపోయాయి.

 #AndhraPradeshElections2019: All about narasannapeta Constituency

2014 ఎన్నిక‌ల్లో టిడిపి గెలుపు..
2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో ఈ నియోజ‌క‌వ‌ర్గంలో మొత్తంగా 196739 ఓట్లు ఉండ‌గా, అందులో 184337 ఓట్లు పోల య్యా యి. టిడిపి నుండి పోటీ చేసిన ర‌మ‌ణ‌మూర్తికి 76559 ఓట్లు రాగా, వైసిపి నుండి పోటీ చేసిన ధ‌ర్మాన కృష్ణ‌దాస్ కు 71759 ఓట్లు వ‌చ్చాయి. టిడిపి నుండి ర‌మ‌ణ మూర్తి 4800 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2004 ఎన్నిక‌ల్లో ఇక్క‌డ కృష్ణ దాస్ ఓడిపోగా..ఆయ‌న సోద‌రుడు ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు శ్రీకాకుళం నియోజ‌క‌వ‌ర్గంలో ప‌రాజ‌యం పాల‌య్యారు. 2014 త‌రువాత వైసిపి అధినేత జ‌గ‌న్ ఇదే జిల్లాలో త‌న పాద‌యాత్ర ముగింపు ఇచ్ఛాపురం లో జ‌రిగింది. శ్రీకాకుళం జిల్లాలో ఈ సారి ప‌ట్టు నిరూపించుకొనేందుకు టిడిపి..స‌త్తా చాటేందుకు వైసిపి స‌మాయ‌త్తం అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+