శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శ్రీకాకుళం హైవేపై నారా లోకేష్‌ అడ్డగింత.. పోలీసులు, టీడీపీ శ్రేణుల తోపులాట.. ఉద్రిక్తంగా వాతావరణం

|
Google Oneindia TeluguNews

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్‌ను పోలీసులు అడ్డ‌గించారు. శ్రీకాకుళం ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఆయ‌న విశాఖ‌ప‌ట్నం ఎయిర్ పోర్టులో దిగారు. అనంత‌రం రోడ్డుమార్గం ద్వారా ప‌లాస వెళుతున్న లోకేష్‌ను శ్రీకాకుళం స‌మీపంలోని జాతీయ ర‌హ‌దారిపై పోలీసులు అడ్డుకున్నారు. వీరి వైఖ‌రిని నిర‌సిస్తూ తెలుగుదేశం పార్టీ శ్రేణులు కొత్త‌రోడ్డు జంక్ష‌న్ వ‌ద్ద టీడీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఆందోళ‌న‌కు దిగారు.

మాజీ మంత్రులు క‌ళా వెంక‌ట్రావు, చిన‌రాజ‌ప్ప, ఇత‌ర నేత‌లు రోడ్డుపై బైఠాయించారు. ఈ క్ర‌మంలోనే పోలీసుల‌కు, తెలుగుదేశం పార్టీ శ్రేణుల‌కు మ‌ధ్య తోపులాట చోటుచేసుకుంది. ప‌లువురు పార్టీ నాయ‌కుల‌ను, కార్య‌క‌ర్త‌ల‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

శ్రీ‌కాకుళం జిల్లాలోని ప‌లాస‌-కాశీబుగ్గ జంట ప‌ట్ట‌ణాల్లో తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మ‌ధ్య స‌వాళ్లు, ప్ర‌తిస‌వాళ్లు కొన‌సాగుతున్నాయి. మంత్రి అప్ప‌ల‌రాజుకు మ‌ర్యాద ఇవ్వ‌కుండా తెలుగుదేశం పార్టీ నేత శిరీష ఏక‌వ‌చ‌నంతో సంబోధించార‌ని, మంత్రికి క్ష‌మాప‌ణలు చెప్పాల‌ని, లేదంటే పార్టీ కార్యాల‌యాన్ని ముట్ట‌డిస్తామంటూ వైసీపీ శ్రేణులు హెచ్చ‌రించాయి.

nara lokesh stopped by srikakulam police

ఆత్మ‌గౌర‌వ స‌భ పేరుతో తెలుగుదేశం పార్టీ కార్య‌క్ర‌మానికి పూనుకోగా రెండురోజుల క్రితం పార్టీ నేత‌ల‌కు చెందిన ఇళ్ల‌ను కూల్చివేసేందుకు అధికార యంత్రాంగం స‌మాయ‌త్త‌మైంది. ఈ త‌రుణంలోనే త‌మ పార్టీ నేత‌ను ప‌రామ‌ర్శించేందుకు నారా లోకేష్ ప‌లాస వెళ్ల‌డానికి విశాఖ ఎయిర్ పోర్టుకు వ‌చ్చారు. లోకేష్ ప‌ర్య‌ట‌న‌వ‌ల్ల శాంతిభ‌ద్ర‌త‌ల‌కు విఘాతం క‌లిగే అవ‌కాశం ఉండ‌టంతో పోలీసులు ఆయ‌న్ను అడ్డుకున్నారు.

English summary
Nara Lokesh, national general secretary of Telugu Desam Party, was intercepted by the police
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X