ఏపీలో వైద్య పరీక్షల తీరిదీ..? ప్లేట్‌లెట్స్ పడిపోయి యువకుడి నరకయాతన, వీడియో: చంద్రబాబు
కరోనా వల్ల రోగులు నరకయాతన అనుభవిస్తున్నారు. ఆ వ్యాధి ప్రజల ప్రాణాలమీదకొస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఓ యువకుడు కూడా ఇలా ప్రాణాలతో పోరాడుతున్నాడు. ఆ వీడియోను ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పోస్ట్ చేశారు. ఇదీ రాష్టంలో వైద్యం అందుతోన్న పరిస్థితి అని కామెంట్ చేశారు. బంగారు భవిష్యత్ ఉన్న యువకుడి బాధను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఫైరయ్యారు.
శ్రీకాకుళం రిమ్స్‌లో ఓ యువకుడు చేరాడు. అతనితో తల్లి కూడా ఉన్నారు. అయితే తన బాధను యువకుడు వీడియో తీసి పోస్ట్ చేయగా.. చంద్రబాబు నాయుడు స్పందించారు. తనకు ప్లేట్ లెట్స్ పడిపోయాయని యువకుడు తెలిపారు. కానీ తనకు కరోనా అని చెప్పి సరిగా వైద్యం అందించడం లేదు అని వాపోయాడు. అందుకోసమే రక్తం కారుతుందని తన గోడును వెల్లబోసుకున్నాడు. తాను చనిపోతానని.. తనకు కూడా విషయం తెలుసు అని అందులో చెప్పడం కలిచివేసింది. ఆ మాటలు ప్రతీ ఒక్కరినీ కదిలించాయి.

తన తల్లిని కాపాడాలని వేడుకున్నారు. తాను చనిపోయాన ఆమె ఒంటరిది అవుతుందని పేర్కొన్నారు. తాను బతకనని.. ఆమెను బాగా చూసుకోవాలని కోరాడు. తన ప్రాణాలు నిలపాలని వేడుకుంటోన్న ఎవరూ పట్టించుకోలేదని చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా..? రిమ్స్ ఆష్పత్రిలో రోగిని ఎందుకు పట్టించుకోవడం లేదు అని ప్రశ్నించారు. అక్కడున్న వైద్య సిబ్బంది యువకుడి గోడును ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు. యువకుడి బాధ చూస్తే కఠినంగా ఉండేవారి గుండె కూడా కరగిపోతుందని చెప్పారు. కానీ ప్రభుత్వ పెద్దలు మాత్రం చలనం లేకుండా ఉంటున్నారని మండిపడ్డారు.
Recommended Video
ఏపీలో వైద్య పరిస్థితులు ఎంత దయనీయంగా ఉన్నాయో చూడండి. ఎంతో భవిష్యత్తు ఉన్న 30 ఏళ్ల యువకుడు తల్లిని కాపాడమంటూ, తన ప్రాణాలు నిలపమంటూ హృదయవిదారకంగా వేడుకుంటున్నా ఎవరూ పట్టించుకోవట్లేదంటే... ప్రభుత్వం ఉండి ఉపయోగం ఏంటి? శ్రీకాకుళం రిమ్స్ లోని ఈ పేషంట్ లను తక్షణం ఆదుకోండి pic.twitter.com/4KjmS9vibc
— N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn) August 7, 2020
-
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్‌కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!! -
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ సంపాదన, ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!!












Click it and Unblock the Notifications