TCS: మాంద్యంలో మస్త్ వార్త చెప్పిన టీసీఎస్.. టాటాలు ఇంతే మరి..!
TCS: దేశంలో అగ్రగామి ఐటీ సేవల కంపెనీ అనగానే అందరికీ గుర్తుకొచ్చేది ముందుగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. అంతర్జాతీయంగా ఉన్న టెక్ కంపెనలే కాక ఇటీవల దేశంలోని కంపెనీలు సైతం ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే.

ప్రపంచవ్యాప్తంగా..
అనేక దేశాల్లోని టాప్ టెక్ కంపెనీలతో సహా చాలా సంస్థలు అనేక కారణాలతో తమ ఉద్యోగులను తొలగిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఏ క్షణంలో లేఆఫ్ మెయిల్ వస్తుందోనని చాలా మంది టెక్కీలు ఆందోళన చెందుతున్నారు. దీనికి తోడు వీసాలపై ఇతర దేశాల్లో పనిచేసేవారి పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. విప్రో సైతం ఇటీవల కొందరు ఫ్రెషర్లను తొలగించింది. అయితే టాటాలకు చెందిన టీసీఎస్ మాత్రం దీనికి పూర్తి భిన్నంగా ఉంది.

గుడ్ న్యూస్..
ఆర్థిక మందగమన పరిస్థితు ఐటీ రంగాన్ని ప్రభావితం చేస్తున్నప్పటికీ ఉద్యోగులను తొలగించాలనే ఆలోచనలో టీసీఎస్ అస్సలు లేదని ఒక ఉన్నతాధికారి వెల్లడించారు. పైగా అనిశ్చితుల కారణంగా ఉద్యోగాలను కోల్పోయిన స్టార్పట్ ఉద్యోగులను రిక్రూట్ చేసుకుంటూ వారికి సహాయంగా నిలుస్తున్నట్లు చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్ ఒక ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ఉద్యోగులను తొలగిస్తారా అనే ప్రశ్నకు బదులిస్తూ.. తాము మాత్రం కంపెనీలో ప్రతిభను పెంచుకోవడాన్ని విశ్వసిస్తున్నట్లు లక్కడ్ తెలిపారు.

స్టార్టప్ తొలగింపులు..
గత సంవత్సరం టీసీఎస్ మెుత్తం ఉద్యోగుల సంఖ్య దాదాపు 6 లక్షలుగా ఉంది. అయితే గత కొంత కాలంగా దేశంలోని ఎడ్ టెక్ వంటి రంగాల్లో చాలా స్టార్టప్ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. అలా ఉద్యోగాలను కోల్పోయిన వారికి టీసీస్ నియమించుకోవాలని చూస్తోందని లక్కడ్ చెప్పారు. యూజర్ ఎక్స్‌పీరియన్స్ డిజైన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్, ప్రొడక్ట్ ఎక్స్‌పీరియన్స్‌లో నైపుణ్యం ఉన్న వారికోసం వెతుకుతున్నట్లు లక్కడ్ చెప్పారు.

కంపెనీ నియామకాలు..
గత ఏడాది 1.19 లక్షల మంది ట్రైనీలతో సహా 2 లక్షల మందిని నియమించుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఇదిలా ఉండగా డిసెంబర్ త్రైమాసికంలో మెుత్తం ఉద్యోగుల సంఖ్య దాదాపు 2000 మేర తగ్గింది. FY24లో 40,000 మందికి పైగా ట్రైనీలను కంపెనీలోకి తీసుకురావాలని చూస్తున్నట్లు టీసీఎస్ యోచిస్తోంది. దేశంలోని తన సిబ్బందికి ప్రపంచ అవకాశాలను కూడా అందించాలని కంపెనీ చూస్తున్నట్లు ఆయన వెల్లడించారు.












Click it and Unblock the Notifications