కంటైన్మెంట్ జోన్లలో ఐసీఎంఆర్ టీం సర్వే, రంగంలోకి 10 బృందాలు, అధ్యయనం చేసి రిపోర్ట్..
హైదరాబాద్‌లో కరోనా వైరస్ కేసులు రికార్డుస్థాయిలో పెరుగుతున్నాయి. డబుల్ డిజిట్ తగ్గకపోవడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. కరోనా వైరస్ పరీక్షలు తక్కువగా నిర్వహిస్తున్నారనే ఆరోపణలు, హైదరాబాద్‌లో కేసుల తీవ్రత దృష్ట్యా.. శనివారం నుంచి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్జ్ సర్వే నిర్వహిస్తోంది. రెండురోజులు సర్వే చేపట్టి.. వైరస్ కేసుల పెరుగుదలకు గల కారణాలను నివేదించనుంది.
సిటీలోని కంటైన్మెంట్ జోన్లు.. ఆదిభట్ల, బాలాపూర్, మియాపూర్, చందానగర్, టప్పాచబుత్రాలో ఐసీఎంఆర్ బృందం సర్వే చేపట్టనుంది. 10 ప్రత్యేక బృందాలు కేసుల విసృతి, లక్షణాలు లేని కేసులు నమోదవడంపై క్షేత్రస్థాయిలో పరిశీలించనుంది. కంటైన్మెంట్ జోన్లలోనే కాక.. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఇప్పటికే ఐసీఎంఆర్ టీమ్ సర్వే చేపట్టింది. దానికి అదనగా కంటైన్మెంట్ జోన్లలో సర్వే చేసి.. నివేదిక అందజేయనుంది. దీని ఆధారంగా వైరస్ విసృతికి గల కారణం తెలిసే అవకాశం ఉంది.

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. కరోనా వైరస్ కేసులు మెజార్టీ శాతం హైదరాబాద్‌లోనే నమోదవుతున్నాయి. మిగతా కేసులు వలసకూలీలు, ఫారిన్ రిటర్న్స్ ద్వారా వస్తున్నాయి. గత 15 రోజుల నుంచి పాజిటివ్ కేసుల సంఖ్య డబుల్ డిజిట్ దాటడం లేదు. ఇటీవల అన్ని విభాగాల కేసులను కలిపి వంద దాటడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!












Click it and Unblock the Notifications