రేపట్నుంచే 10వ తరగతి పరీక్షలు: టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రేపు అంటే సోమవారం నుంచి పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4,94,620 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు.

మొత్తం 2652 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈసారి పరీక్షా కేంద్రాల దగ్గర సీసీ కెమెరాలు, కంట్రోల్‌ రూం ఏర్పాటు చేయాలని ఇప్పటికే మంత్రి సబితా ఇంద్రా రెడ్డి అధికారులకు తెలిపారు.

 10th class exams from tomorrow: free rtc bus travel for students with hall ticket.

ఇది ఇలావుంటే, పదో తరగతి పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులంతా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఇందుకోసం విద్యార్థులు తమ హాల్‌ టికెట్లను చూపిస్తే సరిపోతుంది. కాగా, ఈసారి పరీక్ష పేపర్లను ఆరుకి తగ్గించారు. ఉద‌యం 9:30 నుంచి మ‌ధ్యాహ్నం 12:30 వ‌ర‌కు పరీక్షలు జరగనున్నాయి.

పరీక్ష షెడ్యూల్‌:

ఏప్రిల్ 3 - ఫ‌స్ట్ లాంగ్వేజ్

ఏప్రిల్ 4 - సెకండ్ లాంగ్వేజ్

ఏప్రిల్ 6 - థ‌ర్డ్ లాంగ్వేజ్ (ఇంగ్లీష్‌)

ఏప్రిల్ 8 - గ‌ణితం

ఏప్రిల్ 10 - సామాన్య శాస్త్రం (ఫిజిక్స్, బ‌యాల‌జీ)

ఏప్రిల్ 11- సాంఘిక శాస్త్రం

ఏప్రిల్ 12 - ఓఎస్సెస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేప‌ర్-1

ఏప్రిల్ 13 - ఓఎస్సెస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేప‌ర్-2.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+