వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బొట్టు పెట్టుకున్నందుకు బాలికకు స్కూల్లో శిక్ష

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: పుట్టిన రోజు సందర్బంగా తిలకం పెట్టకుని వచ్చినందుకు చిర్రెత్తి 11 సంవత్సరాల బాలిక పట్ల ప్రిన్సిపల్ విచక్షణారహితంగాప్రవర్థించిన సంఘటన సికింద్రాబాద్ లో జరిగింది. సికింద్రాబాద్ లోని తార్నాకా ప్రాంతంలో సెయింట్ ఆన్స్ స్కూల్ ఉంది. ఈ స్కూల్ విద్యాభ్యాసం చేస్తున్న 11 సంవత్సరాల బాలిక ఇటివల తన పుట్టిన రోజు సందర్బంగా తిలకం పెట్టకుని స్కూల్ కు వచ్చింది.

దాన్ని గుర్తించిన స్కూల్ ప్రన్సిపల్ సెల్లి జోసెఫ్ బాలికపై మండిపడ్డారు. తరువాత ఆమె గది ముందు రెండు గంటల పాటు బాలిక నిలబెట్టి శిక్షించారు. సాయంత్రం ఇంటికి వెళ్లిన బాలిక కుటుంబ సభ్యులకు విషయం చెప్పలేదు. మరసటి రోజు స్కూల్ కు వెళ్లడానికి బాలిక నిరాకరించింది.

Charminar

రెండు రోజుల తరువాత బాలిక తల్లి మెల్లిగా బాలిక దగ్గర సమాచారం తెలుసుకుంది. బాలికను పిలుచుకుని స్కూల్ దగ్గరకు వెళ్లారు. ప్రిన్సిపల్ ను కలిశారు. మీ కుమార్తె తిలకం పెట్టుకుని, తల పిన్ లు పెట్టు కుని స్కూల్ కు వచ్చిందని ప్రిన్సిపల్ ఆవేశంగా ఊగిపోయారని సమాచారం. బాలిక తల్లి చాలా విధాలుగా ప్రిన్సిపల్ కు నచ్చ చెప్పడానికి ప్రయత్నించారు.

బాలిక చుక్క పెట్టుకొలేదని, అది పుట్టు మచ్చ అని చెప్పినా ఆమె పట్టించుకొలేదని తెలిసింది. చివరికి బాలిక కుటుంబ సభ్యులు హ్యుమన్ రైట్ అధికారులకు ఫిర్యాదు చేశారు. తన భార్య, కుమర్తె చెప్పిన మాటలను ప్రిన్సిపల్ పట్టించుకొలేదని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని బాలిక తండ్రి అంటున్నారు.

English summary
An 11-year-old girl in Telangana was allegedly made to stand for two hours outside her school principal's room as punishment for wearing a "tilak" on her birthday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X