జైలే మేలు: 4గురు యువతులు దొరికారు (పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని యూసఫ్ గూడ స్టేట్ హోం నుండి పరారైన పదకొండు మంది యువతుల్లో నలుగురు దొరికారు.
ఆ యువతులు కిటికీ ఊచలు తొలగించి యువతులు పరారయ్యారు. ఎస్సార్ నగర్ పోలీసులు ఈ వ్యవహారంపై దర్యాఫ్తు చేపట్టారు. పరారైన వారిలో ఆరుగురు రెస్క్యూ హోం యువతులు కాగా, మరో ఐదుగురు అనాథలు.
రాష్ట్ర అవతరణ వేడుకల్లో పాల్గొన్న అనంతరం యువతులు వంట గది డోర్ పగులగొట్టి పరారయ్యారు. స్టేట్ హోం సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం వారు దొరికారు.

స్టేట్ హోం
స్టేట్ హోంను మంత్రి తుమ్మల నాగేశ్వర రావు గురువారం సందర్శించారు. స్టేట్, రెస్క్యూ హోంలకు వచ్చేవారి అవసరాలు తెలుసుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లో వచ్చారు, ఏ రకంగా ఉంటారు, మౌలిక వసతులు లేకపోతే ఎలాగని, సమస్యలు ఉంటే చెప్పాలని తుమ్మల స్టేట్ హోం అధికారులకు చెప్పారు.

స్టేట్ హోం
పారిపోయిన 11 మందిలో ఓ బాలికను పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకోగా, గురువారం వివిధ ప్రాంతాల్లో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారిని మంత్రి పరామర్శించారు.

స్టేట్ హోం
వారిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్టేట్, రెస్క్యూ హోంలతో పాటు వివిధ విభాగాలను ఆయన సందర్శించారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఇంఛార్జ్ డైరెక్టర్ ప్రశాంతి, ఆర్జేడీలు రాజ్యలక్ష్మి, శ్యాంసుందరి, డిప్యూటీ డైరెక్టర్ సంధ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు.

స్టేట్ హోం
ఒకే భవనంలో స్టేట్, రెస్క్యూ హోంలు ఉండటం మంచిది కాదని తుమ్మల చెప్పారు. మెట్రో రైలు పనుల వలన ప్రహరీ లేకపోవడంతో భద్రత ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ఇది తమకు జైలులా ఉందని కొందరు యువతులు చెప్పడంతో మంత్రి తుమ్మల అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications