Telangana polling: ఓటరు గుర్తింపు కార్డు లేదా? ప్రత్యామ్నాయంగా ఇందులో ఏ ఒక్కటయినా చాలు

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ గడువు సమీపించింది. ఇంకొక్క రోజే మిగిలివుంది. గురువారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ఆరంభం కానుంది. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. గడువు దాటిన తరువాత కూడా క్యూ లైన్‌లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం ఉంటుంది.

పోలింగ్‌ను సజావుగా కొనసాగించడానికి కేంద్ర ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లనూ పూర్తి చేసింది. ఒకే విడతలో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. డిసెంబర్ 3వ తేదీన కౌంటింగ్. తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మిజోరంలల్లో అదే రోజు ఓట్లను లెక్కిస్తారు. ఓటర్లు అధికారాన్ని ఎవరికి కట్టబెట్టారనేది తేలిది అప్పుడే.

12 Identity Proofs can be used to vote other than Voter ID Check List is here

తెలంగాణలో ఉన్న మొత్తం ఓటర్ల సంఖ్య.. 3,26,18,205. ఇందులో 1,62,98,418 మంది పురుషులు, 1,63,01,705 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 2,676 మంది థర్డ్ జెండర్ ఓటర్లు తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకున్నారు. 15,406 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నారు. అలాగే- 2,944 మంది విదేశాల్లో నివసించే వారు ఉన్నారు.

యువ ఓటర్ల సంఖ్య 9,99,667గా తేలింది. వారి వయస్సు 18 నుంచి 19 మధ్యన నమోదైంది. వారిలో 90 శాతం మందికి పైగా తొలిసారిగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటోన్నా వారే. 80 సంవత్సరాలకు పైనున్న వయస్సు గల వారి సంఖ్య 4,40,371. 9.48 లక్షల మంది ఓటర్ల పేర్లను తొలగించారు.

కాగా ఓటరు జాబితాలో తమ పేర్లను చెక్ చేసుకోవడానికి కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రత్యేక వెసలుబాటును కల్పించింది. సెల్ ఫోన్ నంబర్‌తోనే తమ పేర్లను ఈ జాబితాలో చెక్ చేసుకోవచ్చు. అది- ఓటరు జాబితాలో తమ పేరును నమోదు చేసుకునే సమయంలో ఇచ్చిన సెల్ ఫోన్ నంబర్‌ అయివుండాలి.

దీనికి అవసరమైన లింక్.. https://electoralsearch.eci.gov.in/. ఈ లింక్‌ను క్లిక్ చేసినప్పుడు Search in Electoral Roll అనే హోమ్ పేజీ డాష్ బోర్డ్ ప్రత్యక్షమౌతుంది. దానికి కుడివైపున Search by Mobile అనే అక్షరాలు కనిపిస్తాయి. దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది.

తొలుత Select your State అని క్లిక్ చేసి, తమ రాష్ట్రాన్ని ఎంచుకోవాలి. అనంతరం తమ భాషను ఎంపిక చేసుకోవాలి. కింద మొబైల్ నంబర్ అని ఉన్న చోట ఓటర్లు తమ నంబర్‌ను పొందుపర్చాలి. ఆ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీని పొందుపరిచి, క్యాప్చా కోడ్‌ను టైప్ చేసి, సెర్చ్ అని కొడితే ఓటరు ఐడీ కార్డు నంబర్, పేరు, వయస్సు, తండ్రి పేరు, రాష్ట్రం, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గం, పోలింగ్ కేంద్రం వివరాలన్నీ కనిపిస్తాయి.

జాబితాలో పేరు ఉన్నప్పటికీ.. ఓటరు గుర్తింపు కార్డు అందుబాటులో లేకపోతే ఏం చేయాలనే విషయంపై ప్రత్యామ్నాయ మార్గాలను సూచించింది కేంద్ర ఎన్నికల కమిషన్. ఓటర్ స్లిప్‌తో పాటు 12 ప్రత్యామ్నాయ కార్డులను పోలింగ్ సిబ్బందికి చూపించి ఓటు వేసే వెసలుబాటు కల్పించింది.

పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం సర్వీస్ గుర్తింపు కార్డు, పాన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ లేదా పోస్టాఫీసు జారీ చేసిన ఫొటోతో కూడిన పాస్‌బుక్, మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద కేంద్రం జారీ చేసిన జాబ్ కార్డుల్లో ఏ ఒక్కదాన్ని చూపించయినా ఓటు వేయవచ్చు.

వీటితోపాటు- నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ కింద రిజిస్ట్రార్ జనరల్ అండ్ సన్సన్ కమిషనర్ జారీ చేసిన గుర్తింపు కార్డు, కార్మిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డు, ఎంపీ/ఎమ్మెల్యే/ఎమ్మెల్సీలకు జారీ అయిన అధికారిక గుర్తింపు కార్డు, ఫొటోతో కూడిన పెన్షన్ పత్రాలు, పోస్టల్ డిపార్ట్‌మెంట్ జారీ చేసిన ఫొటోతో కూడిన అడ్రస్ కార్డుల్లో ఏ ఒక్క దాన్ని చూపించయినా ఓటు వేయవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+