బాలికపై 3 నెలలుగా వరుసగా రేప్: వెంటాడి మహిళపై కామాంధుడి అత్యాచారం
ఓ కామాంధుడు బాలికపై గత మూడు నెలలుగా అత్యాచారం చేస్తూ వస్తున్నాడు. కాగా, ఓ మహిలపై ఓ వ్యక్తి రైల్వే పట్టాల వద్ద రేప్ చేశాడు.
ఖమ్మం: ఓ కామాంధుడు గత మూడు నెలలుగా ఓ బాలికపై వరుసగా అత్యాచారం చేస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. చంపుతానని బెదిరిస్తూ అతను 12 ఏళ్ల బాలికపై అత్యాచారం చేస్తూ వస్తున్నాడు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం మద్దివంచకు చెందిన మట్ల సీతారాములు 12ఏళ్ల బాలికను లోబర్చుకున్నాడు. చంపుతానని బెదిరిం చి గత మూడు నెలలుగా బాలికపై అనేక పర్యాయాలు అత్యాచారానికి పాల్పడ్డాడు.
మూడు నెలల తర్వా త బాధిత బాలిక ధైర్యం కూడగట్టుకొని విషయాన్ని తన నాయనమ్మ దృష్టికి తీసుకెళ్లింది. దీంతో బాలిక నాయనమ్మ గార్ల పోలీసులను ఆశ్రయించింది. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు నిందితుడు మట్ల సీతారాములుపై నిర్భయ, ఫోక్స్ చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడు పరారి లో ఉన్నాడని ఎస్సై సీహెచ్ వంశీధర్ తెలిపారు.
ఇదిలావుంటే, హైదరాబాద్ వెళ్లేందుకు భద్రాచలం రోడ్ రైల్వే స్టేషనకు వచ్చిన ఓ మహిళ ప్రాణపాయ స్థితిలో కొత్తగూడెంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఓ కామాంధుడు అత్యాచారం చేయడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. హైదరాబాద్‌లో రైల్వేశాఖలో పనిచేస్తున్న ఓ వృద్ధురాలు (55) భద్రాద్రి జిల్లా కొత్తగూడెం సమీపంలోని తన సొంత ఊరికి వచ్చింది.

తిరిగి హైదరాబాద్ వెళ్లేందుకు సోమవారం సాయం త్రం కొత్తగూడెం రైల్వే స్టేషనకు చేరుకుంది. రా త్రి 8గంటల సమయంలో బహిర్భూమి కోసమని రైల్వే పట్టాల అవతలికి వెళ్లింది. దాన్ని అదునుగా తీసుకుని ఓ కామాంధుడు ఆమెను వెంటాడి, అత్యాచారం చేశాడు. ఆమెకు తీవ్ర రక్త స్రావం కావడంతో నిందితుడు పరారయ్యాడు.
వృద్ధురాలు మంగళవారం తెల్లవారు జామున పోలీస్ స్టేషన కు వచ్చింది. ఇనస్పెక్టర్ రాజగోపాల్ ఆమెతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. బాధితురాలిని ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. సంఘటన జరిగిన ప్రాంతం రైల్వే స్టేషన సమీపంలో వన టౌన పోలీసు స్టేషన పరిధిలో ఉండటంతో వన టౌన ఇనచార్జి ఇనస్పెక్టర్ శ్రీనివాసరా జు ఆధ్వర్యంలో అత్యాచార కేసు నమోదు చేశా రు. బాధితురాలు చెప్పిన ఆనవాళ్లతో నిందితుడి కోసం గాలిస్తున్నారు.












Click it and Unblock the Notifications